Begin typing your search above and press return to search.
కలకలం: దేశంలోకి మంకీపాక్స్ ఎంట్రీ..
By: Tupaki Desk | 15 July 2022 4:30 AM GMTభారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు కేరళలో వెలుగుచూసింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే కేరళకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) నుంచి నిపుణుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది.
యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కేరళలో మంకీపాక్స్ పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఆ వ్యక్తి జూలై 12న తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు. అతని ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి హామీ ఇచ్చారు. అతడితో కాంటాక్ట్ అయిన ప్రాథమిక పరిచయాలు గుర్తించబడ్డాయి. అతని తండ్రి, తల్లి, ఆటో డ్రైవర్, టాక్సీ డ్రైవర్.. 11 మంది తోటి ప్రయాణికులకు కూడా మంకీపాక్స్ టెస్టులు చేస్తున్నారు.
ఈ వైరస్ లక్షణాలు చూస్తే.. ఎగుడుదిగుడు దద్దుర్లుతోపాటు జ్వరం లక్షణాలను కలిగిస్తుంది. మంకీపాక్స్ కేసుల్లో రెండు జాతులు ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి వ్యాపించిన మంకీపాక్స్ లో మరణాల రేటు 1 శాతం వరకు తక్కువగా ఉంటుంది. కాంగో జాతి నుంచి విస్తరించిన కేసుల్లో 10 శాతం మంది రోగులలో మరణానికి కారణమవుతుందని తేల్చారు.
-మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే?
మంకీపాక్స్ వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూ.హెచ్.వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.మంకీపాక్స్ సోకిన వారు ఇతరులతో శారీరకంగా కలవడం.. వారికి దగ్గరగా ఉండడంతో వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు హోం ఐసోలేషన్ లో ఉండాలన్నారు. వ్యాక్సిన్లు, యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నప్పటికీ అవి పరిమితంగా ఉన్నాయని తెలిపారు. 29 దేశాల్లో 1000 కేసులు వచ్చాయని తెలిపారు.
మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల.. లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వ్యాధి బారినపడ్డ వారు ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.
అసహజ శృంగారం వల్ల ఈ కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ ప్రపంచం ఎటుపోతుందని ఆవేదన చెందుతున్నారు. అసహజ తిండివల్లేనే కరోనా సోకింది. ఇప్పుడు అసహజ శృంగారంతో ఇది వ్యాపించడం అందరినీ కంగారుపెడుతోంది.