Begin typing your search above and press return to search.
వామ్మో.. తాజ్ అందం ఇంత ఖరీదా?
By: Tupaki Desk | 16 Sep 2015 10:22 AM GMTప్రపంచ వింతల్లో ఒకటిగా.. ప్రపంచ ప్రేమికులకు గురుతుగా ఉండే తాజ్ మహాల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. నిత్యం వేలాదిమంది దర్శిస్తూ.. తమ జీవితంలో అత్యద్భుతంగా క్షణాల్లో ఒకటిగా తాజ్ సందర్శనను చెప్పుకుంటారు. దేశానికి వచ్చే విదేశీ అతిధులు సైతం.. తమ బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి.. ఏదోలా తీరుబడి చేసుకొని మరీ తాజ్ అందాలు అస్వాదించేందుకు వెళ్లి రావటం కనిపిస్తుంది.
భారత్ కు వచ్చే యాత్రికుల్లో అత్యధికమంది తాజ్ ను చూసేందుకు మక్కువ ప్రదర్శిస్తారు. అలాంటి తాజ్ మహాల్ ను చూడాలనుకునే స్వదేశీ.. విదేశీ యాత్రికులపై భారం పడనుంది. దేశంలోని వారసత్వ కట్టడాల్ని సందర్శించాలనుకునే వారి నుంచి వసూలు చేసే రుసుముల్ని పెంచుతూ ఆర్కియాలజీ శాణ నిర్ణయం తీసుకుంది.
సదరు శాఖ వాదన ప్రకారం.. గడిచిన పుష్కర కాలంలో టిక్కెట్ల ధరల్ని ఇప్పుడే పెంచామని చెబుతోంది. ఇక.. ఇప్పటివరకూ భారతీయులకు రూ.10 ఉన్న ఎంట్రీ ఫీజు 30.. దీనికి అదనంగా రూ.10 టోల్ ట్యాక్స్ కింద వసూలు చేయనున్నారు. ఇక.. విదేశీయుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.250 ఎంట్రీ ఫీజును రూ.750గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. టోల్ ఛార్జ్ కింద విదేశీయుల నుంచి రూ.500 ఛార్జ్ చేయాలని డిసైడ్ చేశారు.
తాజా పెంపుతో.. విదేశీయుల నుంచి మొత్తంగా రూ.1250 వసూలు చేయాలని నిర్ణయించారు. పెంచిన ధరల విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే పరిశీలించి.. అలాంటివేమీ లేకుండా నవంబరు మొదటి వారం నుంచి పెంచిన ధరల్ని వసూలు చేయాలని నిర్ణయించారు. స్వేదేశీ యాత్రికులతో పోలిస్తే.. తాజ్ అందాలు చూడాలంటే విదేశీయులకు కాస్త ఖరీదైన వ్యవహారమేనన్న మాట.