Begin typing your search above and press return to search.
ఈటలపై పోటీకి పెద్దిరెడ్డి సై!
By: Tupaki Desk | 17 Nov 2018 8:15 AM GMTఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ టికెట్ ను మహాకూటమిలో టీడీపీ దక్కించుకోనుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. కూకట్ పల్లి టికెట్ ను నందమూరి సుహాసిని ఎగరేసుకుపోవడంతో తీవ్ర నిరాశకు గురైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డిని హుజురాబాద్ నుంచి బరిలో దించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో పదింటికి కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఓ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. మరో రెండు స్థానాలు హుజురాబాద్ - కోరుట్ల సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. హుజూరాబాద్ నుం చి మహాకూటమి అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేస్తారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి పెద్దిరెడ్డి తొలుత హుజురాబాద్ స్థానాన్నే ఆశించారు. తర్వాత అధిష్ఠానం సూచనతో కూకట్ పల్లికి మారారు. అక్కడ బరిలో దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే - హరికృష్ణ మరణం - మహా కూటమి ఆవిర్భావం అనంతరం పరిణామాల నేపథ్యంలో కూకట్ పల్లిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. కూకట్ పల్లి టికెట్ ను హరికృష్ణ కుమార్తె సుహాసిని ఎగరేసుకుపోయారు.
టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. వెంటనే ఆయన్ను అమరావతికి పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. హుజురాబాద్ నుంచి బరిలో దిగాలని సూచించారు. ఆ టికెట్ ఇప్పించే బాధ్యత తనదేనని బాబు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ సీటును కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇటీవలే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే - కౌశిక్ రెడ్డి విజయావకాశాలపై రాహుల్ కు విశ్వాసమున్నట్లు కనిపించడం లేదు. బలమైన ఈటలను కౌశిక్ ఎదుర్కోగలడా? అని కాంగ్రెస్ అధ్యక్షుడికి చాలా సందేహాలున్నాయి. కాబట్టి ఆ టికెట్ ను టీడీపీకి కేటాయించే అవకాశాలే పుష్కలమని తెలుస్తోంది. పెద్దిరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరుగుతున్న సంగతి గమనార్హం.