Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ లోకి మరో వికెట్.. ఈటలకు షాక్?

By:  Tupaki Desk   |   22 Oct 2022 8:37 AM GMT
టీఆర్ఎస్ లోకి మరో వికెట్.. ఈటలకు షాక్?
X
కలిసి వెళ్లారు.. కానీ గులాబీ మాయాజాలానికి ఇప్పుడు బీజేపీ నుంచి తిరిగి సొంత గూటికి వస్తున్నారు. దాసోజు శ్రవణ్ నుంచి మొదలైన పరంపర స్వామిగౌడ్ , ఇప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి వరకూ సాగనుంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని లాగేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ఒక మెట్టు దిగి పాత టీఆర్ఎస్ నేతలందరినీ తిరిగి గులాబీ గూటికి చేర్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు కూడా గులాబీ గూటికి చేరబోతున్నారు. ఈటల రాజేందర్ అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అయిన ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఈయన 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి గెలిచారు.2018లో ఓడిపోయారు. ఈటలతోపాటు బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి టీఆర్ఎస్ లోకి రావడానికి రెడీ అయ్యారు.

ఏనుగు రవీందర్ 2018లో ఎల్లారెడ్డి నుంచి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన జాజాల సురేందర్ అధికార టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను సురేందర్ కే అప్పగించింది. దీంతో అసంతృప్తికి గురైన రవీందర్ రెడ్డి.. ఈటలతోపాటు బీజేపీలో చేరారు.

ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ తో కలిసి పార్టీని వీడారు. ఈటలతోపాటు తుల ఉమ, రవీందర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరారు. అయితే వీరిని బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు.

బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదులో ఏనుగు రవీందర్ రెడ్డి ఏ విధమైన పాత్ర లేకుండా చేయడం.. ఈటలతోపాటు పార్టీలో గుర్తింపు లభించలేదన్న ఆవేదన రవీందర్ రెడ్డిలో ఉంది. ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు గెలిచినా ఆయనకు బీజేపీలో తగిన గుర్తింపు రావడంలేదన్న బాధ ఉంది. అందుకే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో తిరిగి ఆ పార్టీలోకి వెళ్లడానికి రెడీ అయ్యారని.. సీటు హామీ లభించగానే ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారుతారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.