Begin typing your search above and press return to search.
వరల్డ్ కప్ గెలుపులో దాని పాత్ర చాలా ఉంది.. డబ్బులు కూడాః ఇంగ్లండ్ కెప్టెన్
By: Tupaki Desk | 13 March 2021 5:32 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ లీగ్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల కన్నా.. ఐపీఎల్ ద్వారా వచ్చే ప్రైజ్ మనీ అత్యధికం. అంతేకాదు.. ఆటగాళ్లకు ఆయా టోర్నీల్లో తమ సొంత క్రికెట్ బోర్డులు ఇచ్చే వేతనాల కన్నా.. ఐపీఎల్ వేలం ద్వారా దక్కించుకునే మొత్తం చాలా ఎక్కువ. దీంతో.. ఈ టోర్నీలో ఆడాలని ప్రతీ ఆటగాడూ కోరుకుంటాడు. పాకిస్తాన్ ఆటగాళ్లకూ అవకాశం ఇవ్వాలని పలుమార్లు అభ్యర్థనలు వచ్చాయంటే.. ఐపీఎల్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఐపీఎల్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు అంటున్నాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మోర్గాన్. ఈ టోర్నీని కేవలం డబ్బుతో మాత్రమే కొలవలేమని, అంతకు మించి అంటున్నాడు. అది ఎంతంటే.. తమ జట్టు 2019 వరల్డ్ కప్ దక్కించుకోవడంలో ఈ టోర్నీ పాత్ర ఎంతో ప్రముఖమైందని అంటున్నాడు మోర్గాన్.
ఈ టోర్నీ ద్వారా తమ ఆటగాళ్లు ఎంతో నేర్చుకున్నారని, ఇంకా నేర్చుకుంటున్నారని అన్నాడు. ఈ టోర్నీ ద్వారా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం వస్తుండడంతో.. ఈ సుదీర్ఘమైన టోర్నీలో ఆటగాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారని చెప్పాడు. ఈ అనుభవం తర్వాత ఉపయోగపడుతోందని తెలిపారు.
ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ కు ముందు కూడా తాము ఇండియాలో పర్యటించడం కలిసొచ్చిందన్న మోర్గాన్.. ఐపీఎల్ ద్వారా చాలా మెళకువలు నేర్చుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు మోర్గాన్. దినేష్ కార్తీక్ గతేడాది తప్పుకోవడంతో.. కెప్టెన్సీ మోర్గాన్ ను వరించింది.
ఈ టోర్నీలో ఇప్పటి వరకూ 66 మ్యాచులు ఆడిన మోర్గాన్ 1,272 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ద్వారా అద్భుతమైన అనుభవాలతోపాటు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నట్టు తెలిపారు. ఈ విధంగా ఐపీఎల్ కెరీర్ అనేది అన్ని విధాలుగా క్రికెటర్లకు ఉపయోగపడుతోందని తెలిపాడు మోర్గాన్.