Begin typing your search above and press return to search.
ఈఫీఎఫ్ మీద పన్ను పోటుపై వెనక్కి తగ్గిన జైట్లీ
By: Tupaki Desk | 8 March 2016 8:01 AM GMTఒక నిర్ణయానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవటానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. అందుకు మోడీ సర్కారు కూడా మినహాయింపేమీ కాదు. తనకు బాసటగా నిలిచిన కోట్లాది మంది ప్రైవేట్.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కనికరం లేకుండా తీసుకున్న ఒక నిర్ణయంపై వెల్లువెత్తిన ఆగ్రహజ్వాల మోడీ సర్కారు మంట పుట్టేలా చేసింది. తన నిర్ణయంతో దేశంలోని ఉద్యోగ వర్గానికి జైట్లీ షాకిస్తే.. తమ ఆగ్రహంతో మోడీ సర్కారుకు దిమ్మ తిరిగేలా చేయటంలో ఉద్యోగులు విజయం సాధించారు.
ఉద్యోగులు ఒకసారి పన్ను కట్టి.. తమ భవిష్య నిధిలో(ఈఫీఎఫ్)లో దాచుకున్న మొత్తంపై భారీ వడ్డీ వేస్తామంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించి.. ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బును విత్ డ్రా చేసే పక్షంలో ఆ మొత్తంలో కొంత భాగానికి పన్ను వేస్తామంటూ ప్రకటించిన మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
తమ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన ప్రధాని మోడీ రియాక్ట్ అయి.. ఆర్థికమంత్రి జైట్లీని అలెర్ట్ చేశారు. ఈపీఎఫ్ విషయంలో పునరాలోచన చేయాలని స్పష్టంగా చేయటమే కాదు.. వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీంతో.. జైట్లీ తన దూకుడ్ని తగ్గించి.. ఈపీఎఫ్ విషయంలో తాము ప్రకటించిన వడ్డీ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆర్థికమంత్రి తాజాగా ప్రకటించిన నిర్ణయంతో ఈపీఎఫ్ విషయంలో పాత విధానమే అమలుకానుంది. అయితే.. తమ పట్ల మోడీ సర్కారు వ్యవహరించిన తీరును మాత్రం.. దేశంలోని ఉద్యోగ వర్గం మాత్రం అంత తేలిగ్గా మర్చిపోయే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం. కదిలించుకొని మరీ కొట్టించుకోవటం అంటే ఇలానే ఉంటుందేమో..?