Begin typing your search above and press return to search.

క‌రుణ కోసం మెరీనాపై ఆ ట్వీట్స్ ఏంది స్వామి?

By:  Tupaki Desk   |   8 Aug 2018 7:30 AM GMT
క‌రుణ కోసం మెరీనాపై ఆ ట్వీట్స్ ఏంది స్వామి?
X
నిజ‌మే.. ప్ర‌జ‌లు ఉత్త అమాయ‌కులు. ఇంకా చెప్పాలంటే.. సెంటిమెంట్ ఫూల్స్‌. అలా అనిపించుకోవ‌టానికి స‌గ‌టు జీవి పెద్ద‌గా ఫీల‌వ్వ‌డు. దేవుడు ఇచ్చిన మేథ‌ను జ‌న‌ప్ర‌యోజ‌నం కోసం ఎప్పుడైతే ఒక పార్టీ స్టాండ్ తీసుకొని.. అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం మొద‌లు పెట్టారో.. అప్ప‌టి నుంచి సుబ్ర‌మ‌ణ్య‌స్వామి లాంటోళ్ల మీద ఉండే అభిమానం ఆవిరి అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.

వివాదాస్ప‌ద‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే స్వామి లాంటోళ్లు.. జ‌నాభిప్రాయానికి భిన్నంగా త‌మ గ‌ళాన్ని వినిపించ‌టం మామూలే. అదే.. ఆయ‌న్ను అంద‌రి వాడిగా కాకుండా కొంద‌రి వాడిగా మార్చింది.క‌రుణ జీవితంలో ఎన్ని కోణాలు ఉన్నా.. త‌మిళ ప్ర‌జ‌ల బాగు కోసం అంతో ఇంతో కృషి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. అలాంటి నాయ‌కుడు తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన‌ప్పుడు.. ఆయ‌న అంత్య‌క్రియల విష‌యంలో అంత రాజ‌కీయం.. లొల్లి ఎందుకు?

క‌రుణ ఫ్యామిలీ లెక్క‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. మెరీనాలో అంత్య‌క్రియ‌లు చేస్తే వ‌చ్చే న‌ష్ట‌మేంది? అక్క‌డున్న త‌మిళ పెద్దోళ్ల ప‌క్క‌న క‌రుణ అంత్య‌క్రియ‌లు జ‌రిపితే ఏమైనా అనుకోనిది జ‌రిగిద్దా? త‌ప్పులు ప‌ట్టేవాళ్లు..వేలెత్తి చూపే వాళ్లు ప్ర‌తి ఒక్క‌రి విష‌యంలో ఎంతోమంది క‌నిపిస్తారు. సంపూర్ణంగా అంద‌రి ఆమోదం పొందే నేత అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అది సాధ్యం కాదు కూడా.

ప్ర‌జా జీవితంలో 80 ఏళ్ల పాటు ఉండి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద గ‌ళం విప్పిన పెద్దాయ‌న అంత్య‌క్రియ‌ల మీద నోరు పారేసుకోవ‌టంలో అర్థ‌ముందా? మేథోప‌ర‌మైన మాట‌ల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గాయ‌ప‌ర్చే క‌న్నా.. ఇలాంటి విషాద వేళ కాస్తంత నిశ్శ‌బ్దంగా ఉంటే అంతో ఇంతో బాగుంటుంది క‌దా? అన్న భావ‌న సుబ్ర‌మ‌ణ్య స్వామి ట్వీట్స్ చూస్తే క‌లుగ‌క మాన‌దు.

క‌రుణ అంత్యక్రియ‌లు మెరీనా బీచ్ ద‌గ్గ‌ర జ‌ర‌పాల‌న్న డిమాండ్ ను త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. బ్యాడ్ టైమింగ్ తో కొన్ని అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మెరీనా బీచ్ మీద అన‌వ‌స‌ర‌మైన‌.. మితిమీరిన ఆస‌క్తిని డీఎంకే చూపించ‌కూడ‌ద‌న్న ఆయ‌న‌.. అన్నా ప‌క్క‌నే అంత్య‌క్రియ‌లు జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌టం మూఢ‌న‌మ్మ‌కంగా అభివ‌ర్ణించారు.

మూఢ‌న‌మ్మ‌కాల‌ను క‌రుణానిధి ద్వేషించేవార‌ని.. గాంధీ మండ‌పం కూడా దానికి స‌మాన‌మైన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌దేన‌ని వ్యాఖ్యానించారు. పీవీ.. చంద్ర‌శేఖ‌ర్ లాంటి వారు పద‌విలో ఉన్నా ప్ర‌ధానులు కార‌నే కార‌ణంగా రాజ్ ఘాట్ లో సోనియా నో చెప్పార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. రాజీవ్ కు మిన‌హాయింపు ఇచ్చారు. ఆయ‌న రాజ‌కీయహ‌త్య‌కు గురైన విష‌యాన్ని గుర్తు చేశారు.

మ‌రో ట్వీట్ లో క‌రుణ కోసం మెరీనా ఉద్య‌మంలోకి ప్ర‌వేశించిన వారిని సీఎం ప‌ళ‌నిస్వామి రాజ్యంగ ప్ర‌జాస్వామ్యంలో స‌రైన చోటైన జైలుకు పంపాలంటూ మండిప‌డ్డారు. స్వామి ట్వీట్స్ అస్స‌లు బాగోలేవ‌ని.. ఆయ‌న బ్యాడ్ టైమింగ్ లో ఇలాంటి ట్వీట్స్ చేసిన‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.