Begin typing your search above and press return to search.
బొమ్మ తుపాకీతో నటి.. కాల్చేసిన పోలీసులు
By: Tupaki Desk | 1 Sep 2018 10:19 AM GMTసెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు సంచలనంగా మారుతుంటాయి. అదే సమయంలో విపరీతమైన అనుమానాలు వ్యక్తమయ్యేలా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక ప్రముఖ హాలీవుడ్ నటిని పోలీసులు కాల్చి చంపిన వైనం సంచలనంగా మారింది.
అయితే.. సదరు నటి తుపాకీని గురి పెట్టటంతో ఆందోళనకు గురైన పోలీసులు ఆమెను కాల్చేశారు. షాకింగ్ గా మారిన ఉదంతంలోకి వెళితే.. లాస్ ఏంజెల్సికు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి వెనిస్సా మార్క్వెజ్ ను పోలీసులు కాల్చేశారు. 46 ఏళ్ల ఈ నటిని కాల్చటంపై పోలీసులు వివరణ ఇస్తూ.. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లే సరికి తుపాకీతో గురి పెట్టారన్నారు.
దీంతో బెదిరిన పోలీసుల్లో ఒకరు ఆమెపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. అనంతరం ఆమె చేతిలో ఉన్నది పిల్లలు ఆడుకునే టాయ్ గన్ గా గుర్తించారు. అయితే.. ఈ ఉదంతంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇంటికి వస్తే నటి వెనిస్సా తుపాకీతో ఎందుకు గురి పెట్టిందన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల ఉదంతంపై మరో నటుడు జార్జ్ క్లూనీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతడిపై వెనిస్సా లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. అయితే.. కాల్పుల వ్యవహారంపై స్పందించిన జార్జ్ తాను కేవలం నటుడ్నే తప్పించి మరింకేమీ కాదన్నారు. కొందరు అనుకుంటున్నట్లుగా ఈ ఉదంతంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.