Begin typing your search above and press return to search.
ట్రంప్ కొడుకు ఫారిన్ టూరుకు 67 లక్షలు
By: Tupaki Desk | 7 Feb 2017 9:22 AM GMT‘‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. డోన్ట్ కేర్’’ అని అప్పుడెప్పుడో ప్రేమ్ నగర్ సినిమాలో పాట ఇప్పటికీ ఈ ప్రపంచానికి అతికినట్లు సరిపోతోంది. ఇండియా అయినా అమెరికా అయినా ఈ తత్వం మాత్రం మారడం లేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికలకు ముందు చెప్పిన నీతి కబుర్లన్నీ పక్కన పెట్టి జనం డబ్బుతో కొడుకుని విదేశాలకు పంపించారు. ఇదిప్పుడు విమర్శలకు దారితీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ సొంత వ్యాపార పనుల మీద ఇటీవల ఉరుగ్వే వెళ్లారు. ఎరిక్ పర్యటనకు అమెరికా సర్కారు సుమారు లక్ష డాలర్ల (మన కరెన్సీలో అయితే సుమారు రూ. 67 లక్షలు) బిల్లు చెల్లించింది. అంతా గవర్నమెంటు ఖర్చే. అధ్యక్షుని కుమారుడు కదా.. అందుకు తగినట్టుగా భద్రతా ఏర్పాట్లు జరిపేందుకు పొలోమని భారీ సంఖ్యలో సిబ్బంది ఆయనతోపాటే విమానమెక్కి ఉరుగ్వే వెళ్లారు. వారి వసతి, భోజన ఖర్చు తడిసి మోపెడైంది. ఆయన సొంత పనిమీద వెళ్లినా ప్రజాధనంతో బిల్లు చెల్లించక తప్పలేదు.
దీంతో ట్రంప్ ను విమర్శించేవారంతా మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఒబామాను ఇదే విషయంలో ట్రంప్ పలుమార్లు ప్రశ్నించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఒబామా కుటుంబ సభ్యుల వ్యక్తిగత పర్యటనలకు ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారని ట్రంప్ గతంలో ట్విట్టర్ వేదికగా పలుమార్లు ప్రశ్నించారు. ఇప్పుడు అదే ట్రంప్ పీఠమెక్కిన కొద్దిరోజుల్లోనే అంతా మర్చిపోయారు. దీనిపై విమర్శలు కురుస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/