Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ను ట‌చ్ చేస్తున్న తెలంగాణ పాలిటిక్స్‌

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:16 AM GMT
ఎన్టీఆర్‌ను ట‌చ్ చేస్తున్న తెలంగాణ పాలిటిక్స్‌
X
తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్యమైన వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు కూడా ఎత్త‌ని అధికార పార్టీ టీఆర్ ఎస్ నాయ‌కులు.. ఇప్పుడు ఆయ‌న జ‌పం చేస్తున్నారు. రెండు రోజుల కింద‌ట టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఖ‌మ్మం జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు జ‌నాలు బాగానే వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

తెలంగాణ టీడీపీ పుంజుకునే ద‌శ‌లో ఉంద‌ని.. పాత కాపులు పార్టీలోకి వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చారు. తానే హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశాన‌ని, రాష్ట్రం ఈ రోజు ఆర్థికంగా పుంజుకుందంటే దానికి కార‌ణం తానేన‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నాయ‌కులు వ‌రుస‌గా స్పందించ‌డం ప్రారంభించారు. తొలుత సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త‌ర్వాత‌.. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఈ ప‌రంప‌ర‌లో చంద్ర‌బాబు శిష్యుడు.. ఒక‌ప్పుడు చంద్ర‌బాబు కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసిన నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ మ‌రింత హాట్ కామెంట్లు చేశారు.జూనియ‌ర్ ఎన్టీఆర్ సెంట్రిక్‌గా విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. చంద్ర‌బాబు విఫ‌ల‌మైన నాయ‌కుడుగా పేర్కొన్నారు. ఆయ‌న వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. టీడీపీపై గౌర‌వం ఉంటే.. ఆయ‌న టీడీపీఅధ్య‌క్ష బాద్య‌త‌ల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఇచ్చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అంతేకాదు.. ఏపీ ప్ర‌జ‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌నే కోరుకుంటు న్నార‌ని..కానీ, చంద్ర‌బాబు దొడ్డిదారిలో ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌ను పార్టీకి అధినేత‌ను చేయాల‌ని చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు., కానీ, ఏపీ ప్ర‌జ‌లు, చంద్ర‌బాబును, లోకేష్‌ను తిప్పికొట్టిన విష‌యాన్ని గుర్తుం చుకోవాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మొత్తంగా.. ఖ‌మ్మంలో చంద్ర‌బాబు స‌భ త‌ర్వాత‌.. అనూహ్యంగా తెలంగాణ నాయ‌కులు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తెర‌మీద‌కి తెచ్చి..చంద్ర‌బాబును డిఫెన్స్‌లో ప‌డేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వాస్త‌వానికి... ఆయ‌న ఖ‌మ్మం స‌భ త‌ర్వాత‌.. ఇక్క‌డ పుంజుకుంటార‌ని.. పైగా తెలంగాణ‌కు అనుకూలంగా కూడా వాద‌న వినిపించి.. ఏపీ వైసీపీ నాయ‌కుల‌ను తిట్టిపోశార‌ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

కానీ, ఇంత‌లోనే .. చంద్ర‌బాబును ఇలా జూనియ‌ర్ ను అడ్డు పెట్టి.. తెలంగాణ నేత‌లు..అందునా.. ఆయ‌నకు చెందిన‌ గ‌త నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. మ‌రి దీనికి చంద్ర‌బాబు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి. కానీ, ఎప్పుడూ లేనిది.. ఎన్టీఆర్ పేరును తెర‌మీదికి తీసుకురావ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీసింది. పైగా.. ఏపీలో టీడీపీ గురించి తెలంగాణ నేత‌ల‌కుఅ వ‌స‌రం లేని స‌బ్జెక్టు. కానీ, ఇక‌, ఏకార‌ణం దొర‌క‌నే ఇలా చేస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.