Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ ను పార్టీనేతే ఐటెం గర్ల్ అన్నారే

By:  Tupaki Desk   |   25 Oct 2015 3:55 AM GMT
ఫైర్ బ్రాండ్ ను పార్టీనేతే ఐటెం గర్ల్ అన్నారే
X
ఆవేశంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు.. ఎవరి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలీని పరిస్థితి. అయితే.. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో వచ్చే మాటలు నేతల వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు.. పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మర్చిపోయారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు.. రేవంత్ రెడ్డిల మధ్య నడిచిన మాటల యుద్ధంలో ఎర్రబెల్లిని రేవంత్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తే.. అదే స్థాయిలో ఎర్రబెల్లి రేవంత్ ను మాటలు అన్నట్లుగా చెబుతున్నారు.

వీరి మధ్య నడిన ఘర్షణను పార్టీ నేతలు కలిసి తగ్గించే ప్రయత్నం చేశారు. అనంతరం వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యూహాంపై చర్చ సందర్భంగా సూటిపోటి మాటలు నెలకొన్నట్లు చెబుతున్నారు. వరంగల్ ఉఫ న్నికల్లో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించాలని.. సార్వత్రిక ఎన్నికల్లో మిత్రధర్మంలో భాగంగా బీజేపీకి వరంగల్ స్థానాన్ని కేటాయించారని.. ఉప ఎన్నికల్లోనూ అదే విధానాన్ని అనుసరించాలన్నది ఎర్రబెల్లి వాదన.

దీనికి తీవ్రస్థాయిలో రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మిత్రధర్మం అన్నమాటకు సటైర్ వేస్తూ.. రాత్రిపూట వేరే పార్టీ నేతలతో కలిసే వారు ‘‘మిత్రధర్మం’’ గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిపిన సర్వేలో బీజేపీ కంటే పార్టీకే ఎక్కువ అవకాశాలున్నట్లు తేలిందని.. ఇలాంటప్పుడు బీజేపీని బరిలోకి దించటంలో అర్థం లేదన్నది రేవంత్ వాదనగా చెబుతున్నారు.

తనపై సటైర్ వేసిన రేవంత్ పై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతూ.. సినిమాల్లో ఐటెం సాంగు లెక్క కొంతమంది మీటింగ్ లకు హాజరవుతారని.. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెల్వదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో మిగిలిన వారు కల్పించుకొని ఇద్దరికి సర్దిచెప్పినట్లు చెబుతున్నారు. పార్టీ కోసం దేనికైనా రెఢీ అంటూ.. అధికారపక్షంపై తీవ్రస్థాయిలో పోరాడుతున్న రేవంత్ ను ఐటెం గర్ల్ గా పోల్చటం ఏమిటని.. ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రేవంత్ వర్గం. తాజా పరిణామాలు చూస్తుంటే.. వెనువెంటనే చంద్రబాబు సీన్లోకి రావటంతో పాటు.. ఇరువురు నేతల్ని కూర్చోబెట్టి దిశానిర్దేశం చేయాల్సిన సమయం అసన్నమైందని చెబుతున్నారు.