Begin typing your search above and press return to search.

ఎర్ర‌బెల్లి రాజ‌కీయ స‌న్యాసం త‌ల‌సాని చేతిలో?

By:  Tupaki Desk   |   22 July 2015 9:05 AM GMT
ఎర్ర‌బెల్లి రాజ‌కీయ స‌న్యాసం త‌ల‌సాని చేతిలో?
X
మొన్నామ‌ధ్య పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు సంబంధించి చేసిన విమ‌ర్శ‌ల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆగ‌మాగం చేయ‌ట‌మే కాదు.. తెలంగాణ తెలుగుత‌మ్ముళ్ల‌కు గుక్క తిప్పుకోకుండా షాక్ ల మీద షాక్ లు ఇవ్వ‌టం తెలిసిందే.

పాల‌మూరు ఎత్తిపోత‌ల విష‌యంలో బాబును పొగిడేసిన త‌మ్ముళ్ల‌ను తూర్పార ప‌ట్టిన తెలంగాణ మంత్రి జూప‌ల్లి.. అనంత‌రం రెండు వ‌ర్గాల మ‌ధ్య మాటల యుద్ధం జ‌రిగింది. ఆపై.. ఒక‌రిపై ఒక‌రు స‌వాళ్లు విసురుకోవ‌టం జ‌రిగింది.
దీనికి ప్ర‌తిగా ఈ అంశంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు మంత్రి జూప‌ల్లి అసెంబ్లీలో వ‌రుస‌గా వెయిట్ చేయ‌టం.. దానికి తెలుగుత‌మ్ముళ్ల నుంచి సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం రాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా త‌మ పార్టీ నుంచి జంప్ అయి.. తెలంగాణ అధికార‌ప‌క్షంలో చేర‌ట‌మే కాదు.. మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పై త‌మ్ముళ్లు క‌న్నెర్ర చేశారు.

త‌ల‌సాని వ్య‌వ‌హారంలో తెలంగాణ స‌ర్కారు ఇరుక్కుంద‌న్న భావ‌న‌తో.. ఒత్తిడిని మ‌రింత పెంచేందుకు తాజాగా తెలుగుత‌మ్ముళ్లు ఆందోళ‌న చేప‌ట్టారు.

తాజాగా తెలంగాణ స్పీక‌ర్ ఇంటి ఎదుట తెలంగాణ తెలుగుదేశం నేత‌లు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి త‌ల‌సాని రాజీనామా చేసి ఆర్నెల్లు గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు నిర్ణ‌యం తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తూ వారు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. త‌ల‌సాని త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఎన్నిక‌ల్లో మ‌రో మారు ఎమ్మెల్యేగా గెలిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పు కుంటాన‌ని.. రాజ‌కీయ స‌న్యాసం చేస్తార‌ని స‌వాలు విసిరారు.

నిజానికి ఎర్ర‌బెల్లి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఇది మొద‌టిసారి కాదు. మ‌రి.. ఎర్ర‌బెల్లి స‌వాలుకు త‌ల‌సాని స్పందిస్తారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే..ఎర్ర‌బెల్లి రాజ‌కీయ స‌న్యాసం త‌ల‌సాని చేతిలో ఉందా? లేదా? అన్న‌ది కాల‌మే బ‌దులివ్వాలి.