Begin typing your search above and press return to search.
ఎర్రబెల్లి కొత్త దోస్తీ టీఆర్ ఎస్ కు షాకిస్తోంది
By: Tupaki Desk | 19 Nov 2016 4:04 AM GMTతెలంగాణ టీడీపీ మాజీ నాయకుడు - ప్రస్తుత టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కొత్త దోస్తానపై అటు తెలుగుదేశం పార్టీ నేతలు ఇటు టీఆర్ ఎస్ నేతలు ఆసక్తికరంగా ముచ్చటించుకున్నారు. టాటా చెప్పిన తెలుగుదేశం పార్టీ నేతలతో ఎర్రబెల్లి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం టీడీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుండగా టీఆర్ ఎస్ నేతలు షాక్ కు లోనవుతున్నారు. ఈ ఆసక్తికరమైన సంఘటన ఆదిలాబాద్లో జరిగింది. తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలో నమోదైన ఉప ఎన్నికల కేసులో జరిగింది.
తెలంగాణ టీడీపీ నాయకుడిగా ఉన్న సమయంలో నమోదైన కేసుపై హాజరయ్యేందుకు ఆదిలాబాద్ కోర్టుకు వెళ్లారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్తుండగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి వెళ్లారు. ఒకే కారులో ప్రయాణించి.. మధ్యాహ్న విందులో కలిసి భోజనం చేశారు. ఇలా ఒకే కారులో ప్రయాణించిన ఎల్.రమణ-ఎర్రబెల్లి దయాకర్ రావు తీరా ఆదిలాబాద్ సమీపానికి వచ్చేసరికి ఎవరికి అనుమానం రాకుండా తమ సొంత కార్లలో కోర్టుకు ఒకే సమయానికి హాజరయ్యారు. కేసు విచారణ డిసెంబర్ 20కి వాయిదాపడగా తిరిగి పాత మిత్రులైన వీరిద్దరూ మాజీ ఎంపీ- టీడీపీ పొలిట్ బ్యూరో రాథోడ్ రమేష్ తో కలిశారు. అనంతరం ఆదిలాబాద్ లోని టీడీపీ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బాని ఇంట్లో విందుకు హాజరు అయ్యారు.
ఇక్కడితోనే ట్విస్టులు ఆగిపోలేదు. విందు సమావేశం సందర్భంగా స్థానిక టీడీపీ నేతలతో ఎర్రబెల్లి అప్యాయంగా పలకరిస్తూ రాజకీయాల గురించి చర్చించారు. అదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మధ్యాహ్న విందుకు హాజరయ్యారు. మిత్రపక్షమైన టీడీపీ నేత రమణ - టీఆర్ ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావును కలుసుకొని తనకున్న అనుబంధాన్ని మరోసారి నెమరేసుకున్నారు. రాజకీయ పరిస్థితుల గురించి వీరు ఒకేచోట చర్చించుకొని తిరిగి ఓ ప్రైవేట్ హోటల్ లోని గదిలో కొద్దిసేపు బస చేయడం విశేషం. ఈ పరిణామం టీఆర్ ఎస్ శ్రేణులను కలవర పర్చినట్లయింది. టీఆర్ ఎస్ - టీడీపీ అగ్రనేతలు ఒకేచోట కలుసుకొని విందు ఆరగించిన సంఘటన రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపడమే కాకుండా రాజకీయాల్లో బద్ధశత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని ఈ సంఘటన నిజం చేస్తుందంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/