Begin typing your search above and press return to search.
ఎర్రబెల్లి ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా?
By: Tupaki Desk | 23 Sep 2015 9:32 AM GMTవిమర్శలు.. ఆరోపణల అస్త్రాల్ని బాగా నూరుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు సిద్ధమైన నేతలతో కొలువు తీరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కాస్త హుందా గానే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. అన్నీ పక్షాల నేతలు ఈ అంశంపై ప్రసంగించారు.
అందరూ మాట్లాడింది ఒక ఎత్తు అయితే.. టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. సభలోకాస్తంత కలకలాన్ని.. మరికాస్త నవ్వుల్ని పూయించాయి.
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిలో తమ పార్టీ కీలక భూమిక పోషించిందని గొప్పలు చెప్పుకున్న ఎర్రబెల్లి.. ఆ క్రమంలో నోరు జారారు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలని తాము కోరుకున్నట్లు పేర్కొన్నారు. తాను ప్రసంగిస్తున్నది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అన్న విషయాన్ని ఎర్రబెల్లి మర్చిపోవటం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ఏంటి? తెలంగాణ కదా? అని కొందరు సభ్యులు అరవటంతో సభలో ఒక్కసారి నవ్వులు విరబూసాయి.
దాంతో సర్దుకున్న ఎర్రబెల్లి.. అ.. అదే.. తెలంగాణలో.. తెలుగు వ్యక్తిగా పుట్టాలని భావిస్తున్నా అని వ్యాఖ్యానించటంతో అప్పటివరకూ గంభీరంగా ఉన్న సభలో నవ్వులు విరబూశాయి. స్పీకర్.. ముఖ్యమంత్రి సహా పలువురు సభ్యులు ఎర్రబెల్లి మాటకు నవ్వుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి 15 నెలలు దాటుతున్నా ఎర్రబెల్లి ఇలాంటి విషయాల్ని మర్చిపోవటం ఇబ్బందే సుమి.