Begin typing your search above and press return to search.
లోకేష్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
By: Tupaki Desk | 11 Feb 2016 6:56 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్ జోరు పీక్ స్టేజీకి చేరిందనేది టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు చేరికతో కన్ ఫర్మ్ అయిపోయింది. ఫ్లోర్ లీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి జంప్ కావడం, తనతో పాటు మరో ఎమ్మెల్యే ను వెంటబెట్టుకుపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. తన చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీకి మనుగడ లేదని భావించడం వల్లే గులాబీ గూటికి చేరినట్లు చెప్పారు. అయితే అంతటితోనే ఆపేయకుండా తాజాగా మరో ఆసక్తికరమైన కామెంట్ ను చేశారు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి టీడీపీలో దక్కుతున్న ప్రాధన్యం - అన్నీ ఆయనే అన్నట్లుగా జరుగుతున్న తీరు టీడీపీ నాయకులను ఆందోళనకు గురిచేస్తోందని ఎర్రబెల్లి చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో రేవంత్ నిందితుడని మండిపడ్డారు. ఆయన చేసిన పని పార్టీ పరువును గంగపాలు చేసిందని దుయ్యబట్టారు. నేరాలు చేసేందుకే టీడీపీని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబును - ఆయన తనయుడు లోకేష్ ను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యానికి లాజిక్ ఇదేనని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని సార్వత్రిక ఎన్నికలతో పాటు వరంగల్ ఉప ఎన్నిక - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తేల్చాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. పార్టీకి భవిష్యత్ లేకపోవడం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఆకాంక్షతో తాను టీఆర్ ఎస్ లో చేరినట్లు ఎర్రబెల్లి ఈ సందర్భంగా వివరించారు.