Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌వి కోసం ఇంత చేయాలా.. ద‌య‌న్నా?!

By:  Tupaki Desk   |   24 Dec 2022 2:30 AM GMT
మంత్రి ప‌ద‌వి కోసం ఇంత చేయాలా.. ద‌య‌న్నా?!
X
కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న‌ను పొగుడుతున్నారు. ఆయ‌న కుటుంబాన్ని పొడుగుతున్నారు. విమ‌ర్శ‌కులు, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ భాష‌లో చెప్పాలంటే.. భ‌జ‌న చేస్తున్నారు. చేసుకోండి! త‌ప్పులేదు. కేసీఆర్‌ను చంద్ర‌డు అనండి.. పున్న‌మి చంద్రుడు అని నెత్తిన పెట్టుకోండి. కానీ, ప్రత్య‌ర్థుల‌ను విమ‌ర్శించే ముందు.. కొంత .. గ‌తాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి క‌దా!! అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ మాట‌లు తాజాగా చంద్ర‌బాబుపై నోరు చేసుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ గురించే కావ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ అధినేత చంద్ర‌బాబుఖ‌మ్మంలో స‌భ పెట్టారు. తెలంగాణ‌లో పుంజుకుంటామ‌న్నారు. అంతే.. త‌మ‌కు మ‌రో ప‌క్క‌లో బ‌ల్లెం త‌గులుతోంద‌ని భావించిన కేసీఆర్ టీం.. వెంట‌నే త‌మ మందీ మార్బ‌లాన్ని రంగంలోకి దించేసింది. పైగా.. చంద్ర‌బాబుకు అత్యంత ముఖ్య నేత‌ల‌నే రంగంలోకి దించేస్తే.. పోలా.. అనుకున్నారో ఏమో.. వెంట‌నే ఎర్ర‌బెల్లిని మీడియా ముందుకు పంపేశారు. ఇంకేముంది.. కేసీఆర్ స‌ర్‌ను మైమ‌ర‌పించాల ని అనుకున్నారో.. ఏమో.. వెంట‌నే చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు.

ఓకే.. దీనిని కూడా ఎవ‌రూ కాద‌న‌రు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిగా ఉంటే త‌మ్ముడినైనా ఉతికి ఆరేస్తున్నారు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి క‌దా!! ఎర్ర‌బెల్లి అన్న డైలాగులు.. అన్నీ హ‌ద్దులు చెరిగిపోయాయి. ఇలా అన‌డంపైనే ఇప్పుడు నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.

2015.. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అప్ప‌టికి ద‌యాక‌ర్ టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయ‌న ఏమ‌న్నారంటే..చంద్ర‌బాబు వెన్నుపోటి పొడిచి పార్టీని అనుభ‌విస్తున్నార‌ని చెప్పారు. మ‌రి ఆనాడు మీరు ఈ పార్టీలో ఉన్న‌ప్పుడు.. ఇలా ఎందుకు అనిపించ‌లేదు? అనేది ప్ర‌శ్న‌.

2009-2014.. తెలంగాణ ఎన్నిక‌లు.. టీడీపీ త‌ర‌ఫున పాల‌కుర్తి నుంచి మ‌ళ్లీ టికెట్ వ‌స్తుందో రాదో.. అనే బెంగ‌తో.. ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ప‌డుకున్న సంగ‌తి మ‌రిచిపోయారు. చంద్ర‌బాబు కోసం.. ఎదురు చూసిన సంగ‌తిని మ‌రిచిపోయారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది .. ఏ పార్టీ సారూ.. అని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లే ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే చంద్ర‌బాబు ద‌గ్గ‌ర చేతులు క‌ట్టుకున్న‌ది గుర్తు లేదా? అదే నంద‌మూరి కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని.. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌శ్నించ‌లేదు? స‌ర్‌? అని ప్ర‌శ్నిస్తున్నారు.

కొస‌మెరుపు: రాజ‌కీయాల్లో ఎన్న‌యినా.. చేయొచ్చు.. ఎన్ని మాటలైనా అనొచ్చు. కానీ, మ‌న‌స్సాక్షిని.. మాన‌వ‌త్వాన్ని కూడా చంపేసుకుంటే..కేవ‌లం మ‌ట్టి విగ్ర‌హ‌మే మిగులుతుంది. ఇదే టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా అనేక మంది ఇత‌ర పార్టీల్లోనూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వ‌ర‌రావు కూడా టీఆర్ఎస్ పంచన చేరి.. మంత్రి భోగం అనుభవించారు. కానీ, ఏనాడూ.. హ‌ద్దులు .. స్థాయిని మీరి.. నోటికి వ‌చ్చింది మాట్లాడి.. అధినేత‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పాట్లు ప‌డ‌లేదు.. ఇదీ.. ద‌యన్నా రాజ‌కీయం అంటే!! అంటున్నారు నెటిజ‌న్లు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.