Begin typing your search above and press return to search.
రైతుల అలకతో గులాబీ దళంలో వణుకు
By: Tupaki Desk | 30 Sep 2015 6:24 AM GMTవిపక్షాలపై విరుచుకుపడటం.. తమను వ్యతిరేకించే వారి పీచమణచటం లాంటి పనులు తెలంగాణ సర్కారుకు కొత్తేం కాదు. తమ రాజకీయ ప్రత్యర్థులు.. తమకు వ్యతిరేకంగా ఉండే పక్షాల విషయంలో ఓ కన్నేసి ఉంచే తెలంగాణ అధికారపక్షానికి ఊహించని షాక్ ఒకటి తగిలింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమితంగా ఇష్టపడే ఫాంహౌస్ ఉన్న గ్రామంలో రైతులు అలక వహించటం గులాబీ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓ పక్క రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో హాట్ హాట్ గా చర్చ సాగుతున్న సమయంలోనే ఫాంహౌస్ ఉన్న గ్రామంలోని రైతులు అలక దీక్ష వహించటం ప్రభుత్వ యంత్రాంగానికి ముచ్చమటలు పోసేలా చేసింది.
మెదక్ జిల్లా జగదేవపూర్ మండలంలోని ఎర్రవల్లికి సమీపంలోనే కేసీఆర్ ఫాంహౌస్ ఉంది. ఇక్కడి రైతులు ఆందోళన చేయటం ఒక ఎత్తు అయితే.. ఆ ఆందోళనకు నేతృత్వం వహించింది మరెవరో కాదు.. కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కోసం ‘‘గడ’’ ఏర్పాటు చేయటం.. దీనికి చెందిన వ్యవసాయ శాఖ ఓఎస్డీ అశోక్ కుమార్ స్వయంగా రైతుల పక్షాన నిలిచి నిరసన వ్యక్తం చేయటం ప్రభుత్వ వర్గాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది.
సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన ఒక కీలక అధికారి.. రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేయటం.. ఈ విషయానికి కానీ ప్రచారం లభిస్తే తమకొచ్చే ఇబ్బందుల్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఉరుకులు పరుగుల మీద అలక దీక్ష ప్రాంతానికి వెళ్లారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రైతుల నిరసనకు నేతృత్వం వహిస్తున్న వ్యవసాయ శాఖాధికారి అయిన అశోక్ కుమార్ రైతుల ఆత్మహత్యలకు సరికొత్త కారణాలు చెప్పుకొచ్చారు.
అధికారులు లంచాలు తీసుకోవటం.. అక్రమంగా వ్యవహరించటం లాంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రైతులకు న్యాయం జరిగే వరకూ తాను ఉపవాస దీక్ష ను వదలనంటూ ఆయన మొండికేయటంతో.. ఆయన్ను బుజ్జగించి రైతుల అలక దీక్షను విరమించేంత వరకూ అధికారులతో పాటు.. తెలంగాణ అధికారపక్షం టెన్షన్.. టెన్షన్ పడిన పరిస్థితి