Begin typing your search above and press return to search.
త్వరలో ఎర్రవల్లి క్షేత్రం
By: Tupaki Desk | 26 Dec 2015 11:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్ఠాత్మకంగా అయుత చండీ యాగాన్ని నిర్వహిస్తున్న ఎర్రవల్లిలోని ఆయన పాంహౌస్ ప్రదేశాన్ని చండీ మాత క్షేత్రంగా మార్చాలని భావిస్తున్నారా? అయుత చండీ యాగంలో భాగంగా ఇప్పుడు ఉంచిన విగ్రహాలను అలానే ఉంచాలని నిర్ణయించారా? టీఆర్ ఎస్ లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి.
అయుత చండీ యాగంలో భాగంగా నాలుగు రోజులపాటు వేద ఘోష వెల్లువెత్తడం.. లక్షల మంది ఇక్కడి వస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు, ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ చేకూరింది. యాగంలో భాగంగా ఇక్కడ రాజశ్యామల విగ్రహంతోపాటు చండీ మాత విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలోనే యాగం ముగిసిన తర్వాత అయుత చండీ యాగం నిర్వహించిన ఈ ప్రాంతాన్ని ఎర్రవల్లి క్షేత్రంగా చేస్తే ఎలా ఉంటుందనే దిశగా టీఆర్ ఎస్ లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.