Begin typing your search above and press return to search.
ఈఎస్ ఐ స్కాం : కోదాడలో ఏసీబీ రహస్య విచారణ - అజ్ఞాతంలోకి ప్రమోద్ రెడ్డి
By: Tupaki Desk | 22 Jun 2020 9:31 AM GMTఆంధ్రప్రదేశ్ ఈఎస్ ఐ స్కాంలో ఏసీబీ విచారణ తెలంగాణకి చేరింది. ఈ స్కామ్ కి సంబంధించిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆంధ్రా ఏసీబీ అధికారులు రహస్యంగా కోదాడలో విచారణ జరిపడం స్థానికంగా సంచలనమైంది.
ఈ స్కాంలో ఇంకా ఎవరికీ సంబంధం ఉందోననే అంశంపై విచారణలో స్పష్టత రావాల్సి రానున్నది. నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. ఈ క్రమం లోనే ప్రమోద్ రెడ్డి ని ప్రశ్నించేందుకు ఆదివారం కోదాడ వచ్చారు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతం లోకి వెళ్లి పోయారు. మొబైల్ ఆన్ ఉంటే లొకేషన్ ఆధారం గా కనిపెడతారని భావించి.. స్వీచాఫ్ చేసుకున్నాడు.
దీంతో అతడి ఆచూకీ కోసం ఆంధ్రా ఏసీబీ అధికారులు కోదాడ వచ్చారు. అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను రహస్యం గా విచారించారు. ప్రమోద్ రెడ్డి సొంతూరైన అనంతగిరి మండలంలోనూ విచారణ జరిపారు. అతడి జాడ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు సమాచారం.