Begin typing your search above and press return to search.
ఐదు గంటల విచారణలో అచ్చెన్నను ఏం అడిగారు? ఆయనేం చెప్పారు?
By: Tupaki Desk | 27 Jun 2020 4:30 AM GMTఈఎస్ఐ స్కాంలో కీలకపాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని విచారించింది ఏసీబీ. దాదాపు ఐదు గంటల పాటు సాగిన విచారణలో అధికారులు ఏం అడిగారు? అందుకు అచ్చెన్న ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన ఆయన్ను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
సుదీర్ఘంగా సాగిన విచారణలో అధికారులు అదిగిన చాలా ప్రశ్నలకు అచ్చెన్న సమాధానం చెప్పలేదని తెలిసింది. తనకు తెలీదని.. తనకు అవగాహన లేదన్న మాటలే ఆయన నోటి నుంచి ఎక్కువగా వచ్చినట్లు చెబుతున్నారు. అధికారులు అచ్చెన్నను విచారించే సమయంలో అచ్చెన్న తరఫు న్యాయవాదితో పాటు.. డాక్టర్ ను అనుమతించారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు.. సర్జికల్ విడి భాగాలు..ఫర్నీచర్ ఇతర కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.
మీరిచ్చిన లేఖలతో రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు గా ఆరోపణలపైనా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ పద్దతి లో టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు.. మందులు.. పరికరాల కొనుగోలు వల్లే తాము నామినేషన్ పద్దతిలో కొనుగోలు చేయాల్సి వచ్చిందన్న అధికారుల వాదనకు బలం చేకూరేలా అచ్చెన్న ఇచ్చిన కొన్ని సమాధానాలు ఉన్నట్లు సమాచారం.తాను లేఖలు ఇచ్చినట్లు.. సిపార్సు చేసినట్లుగా అచ్చెన్న నోట మాట వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అదే నిజమైతే.. ఆయన ఫిక్స్ అయినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.