Begin typing your search above and press return to search.
ఈఎస్‌ఐ కుంభకోణం : ఈడీ దర్యాప్తు .. అనేక అనుమానాలు !
By: Tupaki Desk | 14 April 2021 5:30 AM GMTఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ కుంభకోణం కేసులో విచారణ , దర్యాప్తు కొనసాగే కొద్ది అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే అనేక కొత్త కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిల ఇళ్లలో ఈడీ తాజాగా సోదాలు చేయడం, వారి నుంచి దాదాపు రూ.3 కోట్ల నగదు, రూ.కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ఈ కేసులో వీరికి కూడా సంబంధాలు ఉన్నప్పుడు , గత రెండేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ వీరిని ఎందుకు అరెస్టు చేయలేదు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కాకా, వారిని కనీసం విచారించ లేదా, విచారించినా ఆ విషయాన్ని బయటికి చెప్పలేదా , ఒకవేళ ఏసీబీ వీరిని ప్రశ్నించేందుకు యత్నించినా.. ఏవైనా రాజకీయశక్తులు అడ్డు పడ్డాయా , అప్పటి మంత్రి పేషీ నుంచి ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇ ఎస్ ఐ లో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఇందులో ఇ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి కూడా ఉన్నారు. నిందితులు గతంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అవినీతి అధికారిణి దేవికారాణి నుంచి ఏసిబి అధికారులు రూ.4.47 కోట్ల నగదును గతేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ జరిగిందన్న ఏసీబీ నివేదిక ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని డిసెంబర్ నుంచి ప్రశ్నిస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కొత్తగా శ్రీనివాసరెడ్డి, ముకుందరెడ్డిల పేర్లు తెరపైకి రావడం గమనార్హం.
ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.700 కోట్లకుపైగా మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈఎస్‌ఐ ఆసుపత్రి పేద కార్మికులకు ఒక వరం లాంటిది. రూ.25 వేలలోపు వేతనం ఉన్న కార్మికుల నుంచి నెలానెలా రూ.500 వరకు చందా కింద వసూలు చేస్తారు. అలా సేకరించిన నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు కలిపి అనారోగ్యం బారిన పడిన కార్మికులకు వైద్యసేవలు అందిస్తారు. అలాంటి బీద కార్మికులకు దక్కాల్సిన మందులను, వైద్య పరీక్షలకు కావాల్సిన మెడికల్ కిట్లను తదితరాల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోవడం, కమీషన్ల రూపంలో అందినకాడికి దండుకోవడం నాలుగేళ్లపాటు యధేచ్ఛగా సాగింది. దీనిపై కార్మికులు భగ్గుమంటున్నారు.