Begin typing your search above and press return to search.

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా కదిలివచ్చిన మాల్

By:  Tupaki Desk   |   25 Dec 2020 4:30 PM GMT
ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా కదిలివచ్చిన మాల్
X
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ లో మైనస్ డిగ్రీల చలిలో రైతన్నలు చేస్తున్న పోరాటానికి.. దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనూ మద్దతు వెల్లువెత్తుతోంది. రైతుల ఆందోళనపై భారత్ తో మాట్లాడాలని అమెరికా విదేశాంగ మంత్రిని అక్కడి సెనెటర్లు కోరారంటే అర్థం చేసుకోవచ్చు. కెనడా ప్రధాని కూడా దీనిపై స్పందించారు.

ఈ క్రమంలోనే ఓ అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కదిలివచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు చేయూతనందిస్తోంది అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ ‘ఖల్సా’.

ఆందోళన చేస్తున్న రైతులకు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించేందుకు టిక్రి సరిహద్దు వద్ద ‘కిసాన్ మాల్’ ఏర్పాటు చేసింది. రైతులందరికీ వస్తువులు ఉచితంగా అందిస్తోంది.

సబ్సులు, టూత్ బ్రష్ లు, పేస్ట్ లు, నూనె , దుప్పట్లు, చెప్పులు మొదలైన నిత్యావసర వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచింది ఖల్సా ఎయిడ్ అనే ఎన్జీవో సంస్థ. ఈ సంస్థ చేస్తున్న ఉదారతకు రైతుల నుంచే కాదు.. అందరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిప్పుడు వైరల్ గా మారింది.