Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో సింగ‌పూర్ వాటా..?

By:  Tupaki Desk   |   20 July 2015 8:56 AM GMT
అమ‌రావ‌తిలో సింగ‌పూర్ వాటా..?
X
ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి ఉచితంగా మాస్ట‌ర్ ప్లాన్ ఇచ్చిన సింగ‌పూర్ ఏం కోరుకొంటోంది? ఉత్త‌పుణ్యానికే సింగ‌పూర్ మాస్ట‌ర్ ప్లాన్ ఇచ్చిందా? మ‌రే ప్ర‌యోజ‌నాన్ని ఆశిస్తుందా? అన్న దానిపై చాలానే చ‌ర్చ‌లు.. ఊహాగానాలు సాగాయి. అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. కేవ‌లం ఏపీ మీద అభిమానంతో.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుతో ఉన్న అనుబంధం కార‌ణంగా మాస్ట‌ర్‌ప్లాన్ ఇస్తున్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకున్నారు.
ఈ మాట‌ల్ని ఏపీ విప‌క్ష నేత‌లు ఎప్ప‌డో ఖండించారు. ర‌హ‌స్య అజెండా ఏదో ఉంద‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా ఉచితంగా ఎందుకు ప‌ని చేస్తారంటూ సందేహాల్ని బ‌య‌ట‌పెట్టారు. తాజాగా ఆ సందేహాల‌కు ఒకింత స‌మాధానం దొరికే వ్యాఖ్య‌ను సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ చేశారు.

తాజాగా ఒక ఛాన‌ల్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆయ‌న‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాలే కానీ.. అమ‌రావ‌తి నిర్మాణంలో భాగ‌స్వామ్యం అవుతామంటూ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పేశారు. అమ‌రావ‌తి ప్ర‌ణాళిక‌ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగా రూపొందించిన‌ట్లు చెప్పిన ఈశ్వ‌ర‌న్‌.. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ మొత్తం పూర్తి అయ్యింద‌ని చెప్పారు.

ఈశ్వ‌ర‌న్ త‌న మ‌న‌సులోని మాట‌ను అన్యాప‌దేశంగా చెప్పారా? లేదంటే.. ముందుస్తు వ్యూహంతో ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. అమ‌రావ‌తి నిర్మాణంలో భాగ‌స్వామ్యం అంటే దాని లెక్క‌లేంటన్న‌ది తేలాల్సి ఉంది. మొత్తంగా ఉత్త పుణ్యానికి ఏపీ రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయ‌లేద‌న్న విష‌యాన్ని ఈశ్వ‌ర‌న్ త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లే.