Begin typing your search above and press return to search.

సీఎంపైనే ఫైర్ అయిన మంత్రి? ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   1 April 2021 4:30 PM GMT
సీఎంపైనే ఫైర్ అయిన మంత్రి? ఏం జరిగింది?
X
ముఖ్యమంత్రియే అన్నింటికి బాస్. ఆయన కింద పనిచేసే మంత్రులంతా సలాం కొట్టాల్సిందే. తోక జాడిస్తే పోస్ట్ ఊస్ట్ అయినట్టే. కానీ ఇక్కడో మంత్రి ఏకంగా సీఎంకు ఎదురుతిరిగాడు. అంతటితో ఆగకుండా ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. తన మంత్రిత్వశాఖలో సీఎం తల దూరుస్తున్నాడంటూ ఓ మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకీ ఆ రాష్ట్రం కర్ణాటక కాగా.. సీఎం కర్ణాటక సీఎం యడ్యూరప్ప. ఆ మంత్రి పేరు ఈఎస్ ఈశ్వరప్ప

కర్ణాటక గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి ఈశ్వరప్ప తాజాగా తన మంత్రిత్వశాఖలో సీఎం యడ్యూరప్ప తల దూరుస్తున్నాడని గవర్నర్ కు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రియే బాస్. ఆయన అన్ని శాఖల్లో వేలు పెట్టవచ్చు. సరిద్దిద్దవచ్చు. కానీ ఈ మంత్రి మాత్రం ఏకంగా సీఎంపై ఫిర్యాదుచేయడం వింతగా మారింది.

సీఎం అన్నాక అన్ని శాఖలపై సమీక్ష చేయడం.. పనులకు ఆదేశించడం.. ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. కానీ ఈ మంత్రి చేసిన చర్యతో ఇప్పుడు సీఎం యడ్యూరప్ప తలపట్టుకుంటున్నాడు.

ముఖ్యమంత్రి యడ్డీ 1977 వ్యాపార లావాదేవీలకు విరుద్ధంగా తన శాఖలో వేలు పెట్టాడని.. గవర్నర్ తోపాటు మోడీ,బీజేపీ అధిష్టానానికి మంత్రి ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. తన శాఖలో తనకు తెలియకుండా వివిధ పనుల కోసం రూ.774 కోట్ల కేటాయింపులు జరిగాయని ఈశ్వరప్ప ఆరోపణ ఆవేదన..

ముఖ్యమంత్రికి ఇది తగదని.. ఇకపై ఇదే పరంపర కొనసాగితే నేను మంత్రి పదవిలో ఉంలేను అని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. మరి ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది వేచిచూడాలి.