Begin typing your search above and press return to search.
భార్యల కోసం రూ.175 కోట్లతో కార్లు కొన్న రాజు !
By: Tupaki Desk | 22 Jun 2020 11:30 PM GMTఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దీనితో అక్కడి పాలకులు ప్రజల ప్రాణాలను పాటించడంలో తల మునకలవుతున్నారు. అయితే, ఆయా దేశాలకు ఆకలి చావులు కొత్త ఏమో కానీ, ఆఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పేదిరికాన్ని అనుభవిస్తున్న దేశమది.
ఆ దేశంలోని ఈస్వతిని రాజ్యాన్ని పాలిస్తున్న రాజు సోకులు చూస్తే మాత్రం.. ఆ దేశం కరువుతో అల్లాడుతుందని అనిపించదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ దేశంలో పేదలు ఆకలి చావులతో చనిపోవడానికి అతడి జల్సాలు కూడా ఒక కారణమే. స్వాజీ రాయల్ ఫ్యామిలీకి చెందిన మస్వతి-III రాజుకు ఏకంగా 15 మంది భార్యలు ఉన్నారు. అతడి ప్రస్తుతం 19 రోల్స్ రాయిస్ సెడాన్ కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.1.9 కోట్లు. మస్వతి ఇటీవల తన భార్యలకు గిఫ్టుగా ఇచ్చేందుకు ఏకంగా 120 బీఎండబ్ల్యూ కార్లు ఆర్డర్ చేశాడు. వీటి విలువ రూ.175 కోట్లు అని అంచనా.
ఈస్వతినికి వచ్చే నిధుల్లో సగం ఇతడి కుటుంబాన్ని పోషించడానికే సరిపోతాయి. అతడి 15 మంది భార్యలకు 15 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటికే వీరికి రకరకాల కాస్ట్లీ కార్లు ఉన్నాయి. వారి గ్యారేజీలో ప్రస్తుతం 20 మెర్సిడెస్-మేబాచ్ ఎస్600 పుల్‌మ్యాన్, 62 మేబాచ్, బీఎండబ్ల్యూ X6 కార్లు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. రాజు తన విలాసాల కోసం పెడుతున్న ఈ ఖర్చులపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరుతున్నారు.