Begin typing your search above and press return to search.

ఈటల మొదలెట్టాడు.. ఇక రాజకీయం షురూ

By:  Tupaki Desk   |   11 Jun 2021 4:30 PM GMT
ఈటల మొదలెట్టాడు.. ఇక రాజకీయం షురూ
X
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విందు రాజకీయం మొదులుపెట్టారు.టీఆర్ఎస్ ను ఢీకొట్టేలా విందు రాజకీయాలకు తెరతీశారనే ప్రచారం సాగుతోంది. ఈటల ప్రస్తుతం బీజేపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. ఈ నెల 14న బీజేపీ కండువా కప్పుకోవాలని ఈటల డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి చేస్తానన్నారు.

ప్రస్తతుం బీజేపీలో చేరడానికి ముందు ఈటల విందు రాజకీయం మొదలుపెట్టారు. శామీర్ పేటలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం విందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజీసింగ్, ఎంపీ సోయం బాపూరావు, గడ్డం వివేక్ తదితరులను ఆహ్వానించారు.

ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం ఉప ఎన్నిక, బీజేపీ బలోపేతంపై ప్రధానంగా ఈ విందులో చర్చించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రత్యర్థి ఎవరు అవుతారనేదానిపై కూడా చర్చించినట్టు సమాచారం.

ఇక దుబ్బాకలో గెలిచినట్టే హుజూరాబాద్ లోనూ ఈటలను గెలిపించాలని బీజేపీ నేతలు గట్టిగా నిర్ణయించినట్టుగా తెలిసింది. బీజేపీలో ఈటలకు పెద్దపీట వేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ భేటికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాలేదు. సమీప వ్యక్తులు కరోనా బారిన పడడంతో క్వారంటైన్ లో ఆయన ఉండడంతో ఆయన రాలేకపోయారు.