Begin typing your search above and press return to search.

ఉప పోరు లో ఈటల నోటి వెంట భయం మాట.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   27 Oct 2021 8:33 AM GMT
ఉప పోరు లో ఈటల నోటి వెంట భయం మాట.. ఎందుకిలా?
X
ప్రాణాల్ని పణం గా పెట్టేందుకు సిద్ధం. ఈ ముదిరాజు బిడ్డ కు భయం అంటే ఏమిటో తెలీదు.. ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు తరచూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోటి నుంచి వినిపించేవి. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన నోటి వెంట భయం మాట రావటం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక లో కీలకమైన పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న వేళ.. ఈటల నోటి నుంచి వస్తున్న మాటలు మారుతున్నాయి.

మొన్నటి వరకు ఫైర్ బ్రాండ్ మాదిరి విరుచుకుపడిన ఆయన ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న ఉల్లంఘనల్ని ఏకరువు పెడుతున్నారు. అంతే కాదు.. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రత్యేకం గా ప్రస్తావిస్తూ..తన ప్రచారం లో ఆ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మద్యం సీసాల తో.. నోట్లకట్టలతో ఓటర్ల ను టీఆర్ఎస్ నేతలు ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు.

తనను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని.. ఓడిపోతామనే భయం తో టీఆర్ఎస్ నేతలు తన మీద దాడి చేస్తారనే భయం తనకు ఉందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంత కాలం భయం గురించి నోటి వెంట మాట రాని ఈటల.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి వస్తున్న భయం మాటలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. ఇదంతా తన మీద సానుభూతిని పెంచుకోవటం కోసం ఈటల వేస్తున్న ఎత్తుగడగా టీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే.. ఈటల వర్గీయులు మాత్రం.. తమనాయకుడు ఉన్నదే చెప్పారు తప్పించి.. లేనిది చెప్పలేదని చెబుతున్నారు. మొత్తం గా చూస్తే.. ఉప ఎన్నిక ప్రచారం ఆరంభానికి.. పూర్తి అయ్యే వేళకు ఎలాంటి పొంతన లేదన్న మాట మాత్రం పలువురి నోట వినిపిస్తోంది.