Begin typing your search above and press return to search.

ఇంటింటికి వెళ్లి రచ్చ చేస్తానంటున్న ఈటల

By:  Tupaki Desk   |   17 Jun 2021 2:30 PM GMT
ఇంటింటికి వెళ్లి రచ్చ చేస్తానంటున్న ఈటల
X
హుజూరాబాద్ లో గెలవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అప్పుడే అస్త్రాలు సిద్దం చేస్తున్నాడు. రేపటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టాడు. ఇంటింటికి ప్రచారం చేస్తానని ఈటల ప్రకటించారు. హుజూరాబాద్ చైతన్యవంతమైన నియోజకవర్గం అని.. ఆరు సార్లు తనను గెలిపించారని ఈటల అన్నారు. ప్రతి గ్రామంలో తనకు ఆశీర్వాదాలు అందాయన్నారు.

కేసీఆర్ నాకు అన్యాయం చేశాడని హుజూరాబాద్ ప్రజలు అంటున్నారని ఈటల చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ది చెబుతారని ఈటల అంటున్నారు.

మా ప్రజలు ప్రలోభాలకు లొంగరని కేసీఆర్ అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెప్పినా నమ్మరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ లో రాసిస్తే చదివే మంత్రులు, కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారోన తనకు తెలుసన్నారు.

రాచరికానికి తెరదించేందుకు హుజూరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఈటల అన్నారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటెలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఆత్మ గౌరవ పోరాటానికి హుజూరాబాద్ వేదిక కానుందన్నారు.