Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటల జమున
By: Tupaki Desk | 6 Dec 2021 11:30 PM GMTఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం, ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన ఎపిసోడ్.. ఇప్పుడు మరో రూపం తీసుకుంటోంది. ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్ పై కేసు పెడతామని ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రకటించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా చేశారని ఈటల రాజేందర్ ఆరోపణలు వచ్చాయి. ఈ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. భూముల అక్రమాలపై విచారణ జరిపిన మెదక్ జిల్లా కలెక్టర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈటల భూకబ్జా వాస్తవమేనని కలెక్టర్ తెలిపారు. అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములను జమునా హ్యాచరీస్ కబ్జా చేసింది వాస్తవమేనని ఆయన తెలిపారు. కలెక్టర్ ప్రకటనలో ఈటల సతీమణి జమున మండిపడ్డారు. న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలెక్టర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. ఓ దశలో జమున కలెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందని, తాము వ్యాపారాలకు అనుమతులు ఇవ్వద్దని పెద్దలు చెప్పినట్లు అధికారులే చెబుతున్నారని ఆక్షేపించారు.
ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఓ విధంగా... అక్కడి నుంచి బయటకొచ్చినాక మరొలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. తమ భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి? అని జమున నిలదీశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. మహిళా సాధికారిత గురించి మాట్లాడే కేసీఆర్ తనను మానసికంగా హింసించటం ఎంతవరకు సబబు అని జమున వాపోయారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈటల రాజేందర్ పర్యటిస్తారని, ఎదుర్కోవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత భూములను అమ్ముకున్నామని తెలిపారు. హుజురాబాద్ గెలుపును ఓర్వలేక తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు తేవాలని ప్రయత్నిస్తున్నారని జమున ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈటల ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న భూముల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణ వివరాలను మెదక్ కలెక్టర్ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. రిపోర్టు చేసే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది వాస్తవమే తెలిపారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని వెల్లడించారు. 56 మంది అసైన్డ్ దారుల భూములను ఈటల కబ్జా చేసినట్లు విచారణలో తేలిందని కలెక్టర్ వివరించారు. అచ్చంపేట, హకీంపేట పరిధిలో గల సర్వే నంబర్ 77 నుంచి 82,130, హకీంపేట్ శివారులో గల సర్వే నంబర్ 97,111లో సీలింగ్ భూములను కబ్జా చేశారని తెలిపారు. సర్వే నంబర్ 78, 81,130లలో అనుమతులు లేకుండా పెద్ద పెద్ద పౌల్ట్రీ షెడ్స్, ప్లాట్‌ఫామ్‌లు, రోడ్లను అనుమతి లేకుండా నిర్మించారని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తానికి ఈటలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పట్లో వదిలేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.