Begin typing your search above and press return to search.

ఈటలను ఓడిస్తారట.. గుణపాఠం చెబుతారట!

By:  Tupaki Desk   |   25 Jun 2021 2:30 AM GMT
ఈటలను ఓడిస్తారట.. గుణపాఠం చెబుతారట!
X
ఈటల రాజేందర్ మళ్లీ బయటపడ్డాడు. టీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాన్ని బయటపెట్టారు. తనను ఓడించడానికి టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోందంటూ కుట్ర కోణాన్ని బయటపెట్టారు. దీనికి గుణపాఠం చెబుతానంటూ టీఆర్ఎస్ నేతలకు తాజాగా ఈటల హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశాక ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు రెడీ అయ్యారు. ఉప ఎన్నికలకు భీకరంగా రెడీ అవుతున్నారు.

ఉప ఎన్నికలు వచ్చే ఆరునెలల్లో ఉన్నా కూడా ఈటల రాజేందర్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటినుంచే నియోజకవర్గంలోని ప్రజల వద్దకు వెళుతున్నారు. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టి ప్రజలు,ప్రజాసంఘాలు, నేతలను కలుస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా ఆరు సార్లు ఈటల గెలిచారు. కానీ కేసీఆర్ ఎత్తులు జిత్తులు అన్నీ ఈటలకు తెలుసు అన్న గుసగుసలున్నాయి.. అందుకే వాటన్నింటిని తట్టుకునేలా రెడీ అవుతున్నారని అంటున్నారు. మండలానికి ఒక బీజేపీ ఎమ్మెల్యేను, ఎంపీని ఇన్ చార్జిగా పెట్టి ఈటల ముందుకెళుతున్నారు.

హుజూరాబాద్ లో కాషాయ జెండాను ఎగురవేస్తానని ఈటల చెబుతున్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ 5 మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలను మోహరించిందని.. ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కులసంఘాలు, మహిళా సంఘాలను , వివిధ సంఘాలను పిలిపించుకొని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, సర్పంచ్ లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు. నన్ను ఓడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రజలు సహకరిస్తున్నారని.. తనకే నమ్మకం ఉందని ఈటల అంటున్నారు. మరి ఆయన నమ్మకం నిలబడుతుందా? టీఆర్ఎస్ పంతం నెరవేరుతుందా? అనేది చూడాలి మరీ..