Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరేందుకు చార్టెడ్ ఫ్లైట్ లో ఈటల
By: Tupaki Desk | 11 Jun 2021 11:17 AM GMTటీఆర్ఎస్ నుంచి దూరం అయ్యాక ఈటల రాజేందర్ ఇప్పుడు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఇన్ని రోజులు అధిష్టానం హైదరాబాద్ లో ఉండడంతో పోవడం రావడం తేలికైంది. కానీ ఇప్పుడు జాతీయ పార్టీలో చేరుతుండడంతో ఆయన అధిష్టానం అండదండల కోసం ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇటీవలే ఓసారి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటి అయిన ఈటల రాజేందర్ తాజాగా పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తన ఇబ్బందులను వారి ముందు పెట్టి స్పష్టమైన హామీలు పొందారు. ఈటలకు బీజేపీ అధిష్టానం పూర్తి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఈటల.. అందుకు ఈనెల 14న ముహూర్తంగా డిసైడ్ అయ్యారు. తనతోపాటు మరికొందరు నేతల్ని కూడా బీజేపీలో చేర్చాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఈసారి బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళుతున్న ఈటల ఇందుకోసం రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసుకోవడం విశేషం. తనతోపాటు ముఖ్యమైన ఫాలోవర్లను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ఈటల ఇందుకోసం చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ హడావుడి చేసి తన బలం నిరూపించుకునేందుకు గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. చేరికల ప్రోగ్రాంతోనే తన బలం సత్తా చాటాలని ఈటల ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం చార్టెడ్ ఫ్లైట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.