Begin typing your search above and press return to search.

ఈటల ఆగ్రహం.. చీవాట్లు పెట్టేశాడట.?

By:  Tupaki Desk   |   30 Jun 2020 9:00 PM IST
ఈటల ఆగ్రహం.. చీవాట్లు పెట్టేశాడట.?
X
తెలంగాణలో అందరు మంత్రులు ఈ కరోనా లాక్ డౌన్ టైంలో కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే.. పాపం తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం కడుపు కాలిన పిల్లిలా ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారని గులాబీ వర్గాల్లో ఆవేదన ఉంది.

అయితే ముళ్ల మీద కూర్చున్నట్టున్న పనిచేస్తున్న మంత్రి ఈటల రాజేందర్ కు ఇప్పుడు సొంత నియోజకవర్గ నేతల సెగ తగిలిందట.. ఈటల సొంత నియోజకవర్గం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఈ హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఇప్పుడు నిధుల ఖర్చు రచ్చకు దారితీసిందట..

హుజూరాబాద్ మున్సిపాలిటీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 14, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా సుమారుగా నాలుగు కోట్లకు పైగా ఫండ్స్ వచ్చాయి. ఆ నిధుల విషయంలోనే అత్యవసరంగా సమావేశం పెట్టుకున్న కౌన్సిలర్లు-చైర్ పర్సన్ కి మధ్య కొంత విభేదాలు వచ్చినట్టు తెలిసింది. ఫండ్స్ విషయంలో 25శాతం ఎక్కువగా ఫండ్స్ కావాలని చైర్మన్, వైస్ చైర్మన్ పట్టుబట్టడం.. కౌన్సిలర్లు ఒప్పుకోకపోవడంతో రగడ మొదలైంది.

ఈ విషయం కాస్త కరోనా అరికట్టడంలో బిజీగా ఉన్న ఈటల దాకా వెళ్లడంతో కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లకి క్లాస్ తీసుకున్నారట మంత్రి. గెలిచి ఏడు నెలలు కూడా కాలేదని.. అప్పుడే నిధుల పంచాయితీ తెచ్చారా అంటూ ఘాటుగానే మందలించినట్టు సమాచారం. నిధుల పంచాయితీ తేవడంతో ఈటల మండిపడినట్టు ప్రచారం జరుగుతోంది.