Begin typing your search above and press return to search.

కేసీయార్ గురించి జనాలకు తెలీదా ?

By:  Tupaki Desk   |   24 Jun 2021 11:30 PM GMT
కేసీయార్ గురించి జనాలకు తెలీదా ?
X
కేసీయార్ గురించి బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రమంతా తిరిగి చెవిలో ఇల్లు కట్టుకుని మరీ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా వరంగల్ అర్టన్లో పర్యటించిన ఈటల సీఎం వ్యక్తిత్వం ఎలాంటిదో జనాలకు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారం కోసం ఎంతకైనా కేసీయార్ తెగిస్తారంటు మండిపోయారు. కేవలం డబ్బులు, కుట్రలను మాత్రమే నమ్ముకుని కేసీయార్ ఎన్నికలకు వస్తారంటూ తీవ్రమైన ఆరోపణలే చెశారు.

టీఆర్ఎస్ లో ఉన్నంత వరకు కేసీయార్ ను ఇంద్రుడు, చంద్రుడంటు ఇదే ఈటల పొగిడిన సంగతి అందరికీ తెలిసిందే. కేసీయార్ పై ప్రత్యర్ధులు ఆరోపణలు, విమర్శలు చేసినపుడు రాజేందర్ రెచ్చిపోయి ప్రతి విమర్శలు చేసిన విషయం జనాలకు గుర్తుండే ఉంటుంది. అయినా కేసీయార్ వ్యక్తిత్వం గురించి జనాలకు ఈటల కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. టీడీపీలో ఉన్నప్పటినుండి కేసీయార్ వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి చూస్తున్న జనాలు చాలామందే ఉన్నారు.

పార్టీలో ఉన్నంత కాలం కేసీయార్ ను పొగిడిన ఈటల బయటకు రాగానే దుష్టుడు, దుర్మార్గుడని అంటే జనాలు నమ్మేస్తారా ? కేసీయార్ పై ఇన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ఈటల అసైన్డ్ భూములను తాను ఆక్రమించుకోవటం ఏ విధంగా కరెక్టో మాత్రం చెప్పటంలేదు. అసైన్డ్ భూములను ఎవరు కొనకూడదన్న విషయం నాలుడు దఫాలు ఎంఎల్ఏగా ఏడేళ్ళు మంత్రిగా పనిచేసిన ఈటలకు తెలీకుండానే ఉంటుందా ?

ప్రజాప్రతినిధిగా ఉంటు చట్టాన్ని ఉల్లంఘించి దాదాపు 65 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న విషయం ఐఏఎస్ అధికారుల కమిటి విచారణలో బయటపడింది. తాను 65 ఎకరాల భూమిని తీసుకోవటం ఏ విధంగా కరెక్టో చెప్పి జనాలను కన్వీన్స్ చేయగలిగితేనే ఈటలను జనాలు నమ్ముతారు. లేకపోతే కేసీయార్ పై ఎన్ని ఆరోపణలు చేసినా ఉపయోగం ఉండదు.