Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై హ‌రీశ్‌ - ఈట‌ల ఆక‌స్మిక తిరుగుబాటు?

By:  Tupaki Desk   |   30 Aug 2019 11:10 AM GMT
కేసీఆర్‌ పై హ‌రీశ్‌ - ఈట‌ల ఆక‌స్మిక తిరుగుబాటు?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్లు హ‌రీశ్‌ రావు - ఈట‌ల రాజేంద‌ర్ పావులు క‌దుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన కామెంట్లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించ‌డమే కాకుండా...ఈ ఆక‌స్మిక కామెంట్ల వెనుక తిరుగుబాటు చ‌ర్య‌లు ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈటల రాజేంద‌ర్‌ ఇటీవ‌లి కాలంలో హ‌రీశ్‌ రావుతో స‌న్నిహితంగా ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డంతో ఈట‌ల ఈ రీతిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు.

టీఆర్ ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు ప్రాధాన్యం త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా దూరం పెట్టిన కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న్ను లైట్ తీసుకోవ‌డం మొద‌లుపెట్టార‌నే టాక్ ఉంది. దీంతో హ‌రీశ్‌ - ఆయ‌న వ‌ర్గం అసంతృప్తిలో ఉంద‌నే ప్ర‌చారం జరుగుతోంది. అయితే, హ‌రీశ్‌ తో ఈట‌ల రాజేంద‌ర్ ట‌చ్‌ లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆయ‌న్ను కేసీఆర్ వ‌ర్గం టార్గెట్ చేశార‌నే టాక్ ఉంది. ఇటీవ‌ల కొన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు ఇందులో భాగ‌మ‌ని అంటున్నారు.

కాగా, హ‌రీశ్‌ తో స‌న్నిహిత్యం కొన‌సాగిస్తున్నార‌ని భావిస్తూ త‌న‌ను టార్గెట్ చేయ‌డం త‌ట్టుకోలేకే...ఈట‌ల రాజేంద‌ర్ ఇలా త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశార‌ని చెప్తున్నారు. ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా హ‌రీశ్‌ రావుతో ట‌చ్‌ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌రీశ్‌ - వీరు - ఈట‌ల రాజేంద‌ర్ క‌లిసి ఒక‌వేళ గ్రూప్ క‌ట్టి కేసీఆర్‌ ను ప‌ద‌వి నుంచి దించే ప్ర‌య‌త్నం చేస్తారా? అనే చ‌ర్చను సైతం కొంద‌రు తెర‌మీద‌కు తెస్తున్నారు. ఇదే జ‌రిగితే ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు సైతం ఈ చీలిక గ్రూప్‌ న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిఆ ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు.