Begin typing your search above and press return to search.
బండి సంజయ్ ఔట్.? తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఈటల?
By: Tupaki Desk | 4 Jan 2023 5:30 PM GMTతెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు ఉంటే వెంటనే వాటిని తొలగించడానికి రెడీ అవుతోందట.. తన నోటి మాటలతో బీజేపీకి నష్టం చేకూరుస్తూ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అవసరమైతే సాగనంపేందుకు రెడీ అయ్యిందని.. బీజేపీ కొత్త చీఫ్ గా ఈటల రాజేందర్ ను చేయడాలని ఆ పార్టీ యోచిస్తోందని ఓ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది.
తెలంగాణలో ఒట్టి ఊకదంపుడు ఆందోళనలు గాయి గత్తర లేపడం తప్పితే కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా బండి సంజయ్ రాజకీయాలు చేయడంలేలదన్న టాక్ ఉంది. కేసీఆర్ ఎత్తులకు మించి పనిచేయాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ గుట్టుమట్లు అన్ని తెలిసి ఆయనతో ఉద్యమకాలం నుంచి సహవాసం చేసిన ఈటల రాజేందర్ కే ఈ బీజేపీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు.. దూకుడు స్వభావంతో ముందుకెళ్తున్న ఆ పార్టీ నాయకులు కేసీఆర్ ఆలోచనలు అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటిదురుసు బీజేపీకి బాగా మైనస్ అవుతోంది. అయితే మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ సమయంలో బండి సంజయ్ ను చేస్తే బీజేపీ మరింత డ్యామేజ్ అవుతుందని.. అతడికి కేంద్రంలో పదవి ఇచ్చి సాగనంపాలని స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ కి కేంద్రంలో సముచిత స్థానం ఇస్తారని, రాష్ట్రంలో ఈటల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.
తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. వారిని బీజేపీ వైపు మళ్లించాలంటే బీసీ అయిన ఈటల బెస్ట్ అని బీజేపీ యోచిస్తోందట.. ఈటల సామాజికవర్గం ముదిరాజ్ లను బీజేపీకి చేరువ చేయాలన్నది బీజేపీ ఆలోచన. అందుకే తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ లను ఆకర్షించేందుకు ఈటలను ముందుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మునుగోడులో ఓటమికి బండి సంజయ్ కారణమని కేంద్రానికి రిపోర్టు పంపించారట.. ఈ ఓటమితోనే బండి సంజయ్ పై నమ్మకం పోయిందని అంటున్నారు. అందుకే ఈటలను బీజేపీ చీఫ్ ను చేయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.
మరి ఈ ప్రచారం బీఆర్ఎస్ సృష్టించిందా..? లేక నిజంగానే బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారా? ఇదంతా నిజమా? ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.