Begin typing your search above and press return to search.
బీజేపీలో కొత్త సంప్రదాయాన్ని తెచ్చిన ఈటల?
By: Tupaki Desk | 9 Nov 2021 2:30 AM GMTహుజూరాబాద్ అంటే..కేసీఆర్ ఓటమి ఈటల రాజేందర్ గెలుపు మాత్రమే ప్రస్తావనకు వచ్చేది. కేసీఆర్‌ను ఎదిరించిన వీరుడిలా ఈటల పాపులారిటీ తెచ్చుకున్నాడు. తేనె తుట్టేను కదిపి ఇబ్బందుల్లో పడ్డాడనే అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. అయితే ఈ హడావుడి సద్దుమణి.. ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది. అసలు ఈటల ఈ విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నారు. డబ్బు, అధికారం, మందీ మార్బలం ఉన్న కేసీఆర్ అనే సునామీకి ఎదురు ఎలా నిలబడ్డారు. ఆయన పన్నిన వ్యూహాలు ఏమిటి అనే ప్రశ్నలపై చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయన పోల్ మేనేజ్‌మెంట్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన విధానం.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన వైనం.. బీజేపీ వర్గాల్లో పెద్ద చర్చకు లేవనెత్తాయి. అసలు ఈటల స్థాయిలో ఎన్నికల్లో దిగడం బీజేపీ నేతలకు సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నిక చరిత్రలో నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజురాబాద్ లో ధన ప్రవాహం పారింది. ఈ ఎన్నికలను అత్యంత ఖరీదైన ఎన్నికగా అభివర్ణిస్తున్నారు. అధికారపార్టీ హమీలతో పాటు భారీగా ఖర్చు పెట్టిందనే విమర్శలు వచ్చాయి. అధికార పార్టీని ఢీ కొట్టిన బీజేపీ కూడా ఇదే తరహాలో ఖర్చు చేసిందనే ఆరోపణలు వినిపించాయి. హోరాహోరీ పోరులో ఈటల రాజేందర్ విజయం సాధించారు. హుజురాబాద్ లో గెలుపు సంగతి అటుంచితే.. ఇప్పుడు కాషాయ శిబిరంలో కొత్త భయం పట్టుకుందట. హుజురాబాద్ లో ధన ప్రవాహాన్ని చూసిన బీజేపీలు హడలెత్తిపోతున్నారని చెబుతున్నారు. కొందరు కమలం నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారట.
హుజురాబాద్ లో డబ్బుల ప్రవాహాన్ని చూసిన బీజేపీ నేతలు వణికిపోతున్నారు. ఇంతా ఖర్చా అని నోరెళ్లబెతున్నారట. తమకు పార్టీ టికెట్ ఇస్తే ఎక్కడి నుంచి ఇంత మొత్తాన్ని తేవాలని హడలిపోతున్నారని చెబుతున్నారు. హుజురాబాద్ లో టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా భారీగా ఖర్చు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందు రెండు పార్టీలు పోటా పోటీగా సభలు సమావేశాలు నిర్వహించారు. ఇందుకోసం భారీగా డబ్బు ఖర్చు చేశారనే ప్రాచారం జరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఖర్చుల విషయంలో అధికార పార్టీ కంటే అటు ఇటుగా బీజేపీ కూడా ఖర్చు చేసి ఉండోచ్చు.
సహజంగా బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీలో నిలబడ్డ అక్కడికి బీజేపీ అనుబంధ సంఘాల కార్యకర్తలు ప్రచారానికి వస్తారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ ఏర్పాట్లను చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారట. అమ్మో ఏమిటీ ఇంతలా భారీ ఏర్పాట్లను ఎప్పుడూ చూడలేదని చర్చించుకున్నారని చెబుతున్నారు.
ఇంత ఖర్చుచేసినా ఫలితం కాషాయ పార్టీని ఆనందంలో ముచ్చెత్తింది. అయితే ఖర్చులను లెక్కెసుకున్న బీజేపీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. పార్టీ టికెట్ ఇస్తే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి తెవాలనే గుబులు కాషాయ దళాల్లో ప్రారంభమైందని అంటున్నారు. ప్రచారానికి కార్యకర్తలు వస్తే వారికి ఇంత ఘనంగా ఏర్పాట్లు చెయగలమా అని సందేహం వ్యక్తం చేస్తున్నారట. ఈటల రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన అర్ధబలం ఉంది.. కాబట్టి ఆయన ఇంత ఖర్చు చేశారు... తాము కూడా ఇలాగే ఖర్చు చేయాలంటే ఎలా? అనే ప్రశ్నలు కమలం పార్టీ నేతల్లో మొదలయ్యాయి. పార్టీ భావజాలానికి ఈటల కొత్త కాబట్టి ఇలా చేశారని, పార్టీలో ఆయన కొత్త సంపద్రాయాన్ని తెచ్చారని కమలం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.