Begin typing your search above and press return to search.
హరీష్ రావుకే నా గతే: ఈటల హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 7 July 2021 2:51 AM GMTఒకప్పుడు వారిద్దరూ సన్నిహిత మిత్రులు.. తోటి కేబినెట్ సహచరులు.. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రత్యర్థులుగా మారారు. అంత సాన్నిహిత్యం మరిచి పొట్లాడుకుంటున్నారు. ఒకరిని ఓడించడానికి మరొకరు పోటీపడుతున్నారు. వారే టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ నేత ఈటల రాజేందర్.
వీరిద్దరూ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా కొట్లాడుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పై నజర్ పెట్టారు. అక్కడ ఎలాగైనా సరే ఈటలను ఓడించడానికి స్కెచ్ గీశాడు. ఈ క్రమంలోనే మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా మంత్రులను మోహరించి రాజకీయం చేస్తున్నారు.
తన నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న ఒకప్పటి సహచరుడు, నేటి మంత్రి అయిన హరీష్ రావు గురించి తాజాగా ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ‘తన నియోజకవర్గం వారికి హరీష్ రావు ధావత్, డబ్బు ఇస్తున్నారని’ ఈటల ఆరోపించారు. మెప్పు పొందాలనే హరీష్ రావు చూస్తున్నాడని.. అయితే ఆయనకు తన గతే పడుతుందని జోస్యం చెప్పారు. మీ పార్టీలో గెలిచా అన్నారనే తాను రాజీనామా చేశానని ఈటల కౌంటర్ ఇచ్చారు.
హుజూరాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్ పంచే డబ్బులు, ప్రలోభాలకు లొంగరని.. పాతరేస్తారని స్పష్టం చేశారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఈటల విమర్శించారు.
తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే తనపై కేసీఆర్ కుట్ర చేశాడని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. వారి అబద్దాల పత్రిక, చానల్ లో పదేపదే చూపించారని విమర్శించారు. ఆ వార్తలు చూసి ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టుకున్నారని ఈటల వాపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్క్రిప్ట్ ప్రకారం తనపై దాడి చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.