Begin typing your search above and press return to search.
కేసీఆర్ టెంప్ట్ కాకుండా అడ్డుకున్న ఈటెల
By: Tupaki Desk | 19 Jan 2017 9:30 AM GMTముఖ్యమంత్రులు భోళా శంకరుల మాదిరే వ్యవహరిస్తారు. అది వారి ధర్మం. అందుకు తేడాగా వ్యవహరిస్తే ప్రభుత్వానికే ఇబ్బంది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. ఎవరైనా వచ్చి ఆయన్ను ఏదైనా కోరిక కోరితే దాదాపుగా వద్దనే మాట ఆయన నోట వచ్చేది కాదు. ఏదైనా సభలో కానీ సమావేశంలో కానీ ఎవరైనా ఏదైనా హామీ గురించి ప్రస్తావిస్తే.. వెనుకా ముందు చూసుకోకుండా ఓకే చెప్పేసేవారు. వైఎస్ నోటి నుంచి ఒక్కసారి ఓకే చెప్పేశాక.. దానికి సంబంధించిన లెక్కలు డొక్కలన్నీ చూసుకోవాల్సిన తలనొప్పి ఆర్థికమంత్రి మీదనే ఉంటాయి. అందుకే.. అప్పటి ఆర్థికమంత్రి రోశయ్య చాలా అలెర్ట్ గా ఉండేవారు.
వైఎస్ హామీ ఇచ్చే వేళ.. రోశయ్య ఆయన వైపు తదేకంగా చూసేవారు. అందుకే.. ఏదైనా ఆర్థికపరమైన హామీ ఇవ్వాల్సి వస్తే.. తాను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. రోశయ్య వైపు చూపిస్తూ.. ఆయన్ను ఇబ్బంది పెడుతున్నానంటూ చెప్పి.. రోశయ్యను ఇరకాటంలో పెట్టేసేవారు వైఎస్. కొన్ని సందర్భాల్లో రోశయ్యే కలుగజేసుకొని.. అన్నా.. మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు.. ఇలా అయితే కష్టమవుతుందనే విషయాన్ని రోశయ్య ఓపెన్ గా చెప్పేసిన రోజులు కూడా లేకపోలేవు.
ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అడిగిందే తడవు.. ఓకేఅనేసే తత్త్వం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. పది పైసలు అడిగినోడికి పావాల ఇవ్వటం..ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అనే మాటతో పాటు.. భారీగా ఉండేలా వరాలు ఇవ్వటం ఆయనకు అలవాటు. కేసీఆర్ దారిన కేసీఆర్ వరాలు ఇచ్చేస్తే.. పద్దుల లెక్క చూసుకోవాల్సిన ఇబ్బంది ఆర్థికమంత్రిగా ఉన్న ఈటెలకే. అందుకే.. ఈ మధ్య ఈటెల చాలా అలెర్ట్ గా ఉంటున్నారు. తాజాగా ముస్లిం ప్రార్థనా స్థలాలకు సంబంధించి ఇమాంలు.. మౌజంలకు గౌరవ వేతనాల్నిరూ.5వేలకు పెంచాలంటూ కాంగ్రెస్ నేత జీవన రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇందు కోసం రూ.5కోట్లు సరిపోతాయని వ్యాఖ్యానించారు.
కేవలం రూ.5కోట్ల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఇమాంలు.. మౌజంలకు వేతనం పెరుగుతుందంటే.. కేసీఆర్ లాంటి సీఎం కాదనలేరు కదా? ఆయన రియాక్ట్ అయ్యే లోపే ఆర్థికమంత్రి ఈటెల స్పందించి.. మౌజం.. ఇమాంలకు రూ.5వేల చొప్పున ఇచ్చేందుకు రూ.5కోట్లు సరిపోతాయని జీవన్ రెడ్డి చెబుతున్నారని కానీ రూ.60కోట్ల వరకూ అవుతుందని.. జీవనరెడ్డి లెక్కను తాను సరి చేస్తున్నట్లుగా చెప్పారు. భోళాశంకరుడి లాంటి కేసీఆర్ ను తప్పుడు లెక్కలతో టెంప్ట్ చేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. కేసీఆర్ ను ఎవరు టెంప్ట్ చేసినా.. అడ్డుకోవటానికి ఈటెల రెఢీగా ఉన్న విషయం తాజా ఉదంతంతో అందరికి అర్థమైందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/