Begin typing your search above and press return to search.
అప్పుల కుప్ప ఆంధ్రాతో పోలికేంది ఈటెల?
By: Tupaki Desk | 20 March 2016 4:32 AM GMTపోటీ పడితే ఎలాంటోడితో పడాలి? మన కంటే ఎక్కువ ఉన్నోడితో పడాలే కానీ తక్కువగా ఉన్నోడితో కాదు కదా. కానీ.. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం ఆ తీరులో లేదు. ఆయన చెబుతున్న లెక్కలు వింటే నవ్వు రాక మానదు. బడ్జెట్ పై తెలంగాణ విపక్షాలు విరుచుకుపడి.. ప్రశ్నాస్త్రాల్ని సంధిస్తే.. వాటికి సమాధానం ఇచ్చే నేపథ్యంలో ఈటెల వినిపించిన వాదన చిత్రంగా ఉండటం గమనార్హం.
ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నంత కాలంలో తెలంగాణ కోసం నాటి ముఖ్యమంత్రులు చేసిన అప్పుల కంటే.. కేసీఆర్ తన 21 నెలల పాలనలోచేసిన అప్పు ఎక్కువ అంటూ తెలంగాణ విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానమిచ్చే క్రమంలో ఈటెల చెప్పిన లెక్క కాస్తంత విచిత్రంగా ఉండటం కనిపిస్తుంది. తెలంగాణరాష్ట్రం తెచ్చిన అప్పుల గురించి ప్రస్తావించిన విపక్షాల మాటకు ఈటెల సమాధానమిస్తూ.. తెలంగాణకు ఉన్న అప్పు మొత్తం తెలంగాణ స్థూల ఉత్పత్తిలో కేవలం 16.1 శాతం మాత్రమేనని.. అదే ఏపీలో అయితే.. 20.8శాతం ఉందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమని.. డబ్బులున్న సంపన్న స్టేట్ గా గొప్పలు చెప్పుకునే కేసీఆర్ సర్కారు.. అప్పుల కుప్ప అయిన ఆంధ్రప్రదేశ్ తో పోలిక పెట్టుకోవటం ఏమిటి? విభజన కారణంగా ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రం కనుచూపు మేర అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అదే సమయంలో విభజనతో తెలంగాణ ఆస్తులతో బయటకు వచ్చింది. అలాంటి సంపన్న రాష్ట్రం.. అప్పులున్న ఆంధ్రాతో పోల్చుకోవటం ఏమిటి? తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల పోటీ సంప్నన రాష్ట్రాలతోనా? ఏపీలాంటి అప్పులున్న రాష్ట్రంతోనా..?