Begin typing your search above and press return to search.

అలా చేయకపోతే ప్రజలు నన్ను చంపేస్తరు..: ఈటల షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:16 AM GMT
అలా చేయకపోతే ప్రజలు నన్ను చంపేస్తరు..: ఈటల షాకింగ్ కామెంట్స్
X
‘యమలోకంలో నరకం అంటే ఎలా ఉంటుందో తెలియదు... కానీ ఈ ఆరునెలల్లో నేను ఆ నరకాన్ని చూశానని అనుకుంటున్నా.. నన్నే ఓడించేందుకు కేసీఆర్ అన్ని విధాలుగా ప్రయత్నించిండు.. ప్రతి ఒక్కరికి నేను గెలవననే భావన తెచ్చిండు.. కానీ నా నియోజకవర్గ ప్రజలు నన్ను వారి అక్కున చేర్చుకున్నారు.. అయితే వారి కోసమే నేను పనిచేయాలి.. మళ్లీ నేను వాళ్లను మోసం చేస్తే నన్ను చంపేస్తారు..’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హోరా హోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ వీడియో ఆదివారం ప్రసారం కానుంది. అయితే అంతకుముందు విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.

భూ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినేట్ నుంచి భర్త్ రఫ్ చేశారు. దీంతో ఆయన తన ఆత్మగౌరవానికే మాయని మచ్చ అని భావించి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్నహుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ముందుగా ఈటల రాజేందర్ పై గెలుపు సునాయసంగా భావించింది. కానీ ఇంటెలీజెన్స్ సర్వే ప్రకారం నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వైపు ఉన్నట్లు నివేదిక రావడంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత అప్రమత్తమయ్యారు. దీంతో గెలుపే లక్ష్యంగా వివిధ అస్త్రాలను ప్రయోగించారు.

ముందుగా ఈటల అనుచరులను ఆయన నుంచి దూరం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనతో చాలా మంది వెళ్లారు. కానీ తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించేందకు వారికి బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఓ మండల స్థాయి నాయకుడికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా హుజూరాబాద్ కే అప్పగించారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న హరీశ్ రావుకు ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత హుజూరాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలన్నింటిని అందించారు. కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు కేవలం హుజూరాబాద్ కే అందించారు. చివరకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇలా మొత్తానికి ఈటల రాజేందర్ పై అనేక అస్త్రాలను ప్రయోగించినా ప్రజలు ఈటల వైపే మొగ్గారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ‘ఓపెన్ విత్ ఆర్కే’లో మాట్లాడారు. ‘నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజల కోసమే కొట్లాడుతా..అలా చేయని పక్షంలో నన్ను ప్రజలు బతకనివ్వరు. ఇక నన్ను ఎంత వేధించాలో అంత వేధించారు. కానీ ప్రజా తీర్పు ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు. నేను నా ప్రజలకు ఏమిచ్చినా తక్కువే. వారి కోసం ఏమైనా చేస్తాను.అని అన్నారు.

‘ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కలనీయకుండా చేస్తున్న మొదటి ముఖ్యమంత్రిని ఈయననే చూస్తున్నా.. ఎక్కడా ఇలాంటి ముఖ్యమంత్రి లేరు. తన మాటే వినాలి.. తాను చెప్పిందే చేయాలి..కేటీఆర్ సీఎం అయినా మాకు పర్వాలేదు. మాకు మంత్రి పదవి ఇవ్వకున్నా కోరలేదు. కానీ మమ్మల్ని మనిషిలాగా చూడలేదు. అదే బాధించింది. హరీశ్ రావు కు నాకు మంచి స్నేహం ఉంది. కానీ నామీద ఆయనను ప్రయోగించి ఆయన పరువు తీశారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..’ అని ఈటల చెప్పారు. అయితే ఫుల్ వీడయోలో ఏం జరుగుతుందో ఆదివారం చూడాల్సిందే.