Begin typing your search above and press return to search.

కేసీఆర్ కామ్ గా ఉన్న వేళ.. ఈటెల జోరు పెంచేశారా?

By:  Tupaki Desk   |   2 May 2020 6:30 AM GMT
కేసీఆర్ కామ్ గా ఉన్న వేళ.. ఈటెల జోరు పెంచేశారా?
X
కరోనా కేసులు నమోదైన మొదట్లో తరచూ మీడియా ముందుకు వచ్చేవారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. కరోనా ప్రభావం గురించి ఆయన సమాచారం అందించేవారు. అంతకు మించి పెద్దగా మాట్లాడేవారు. తర్వాతి రోజుల్లో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న ఈటెల కామ్ గా ఉంటే.. కరోనా అంశాల్ని మీడియాకు బ్రీఫ్ చేసే బాధ్యతను తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

తన తీరుకు భిన్నంగా అదే పనిగా మీడియా ముందుకు రావటం.. వచ్చిన ప్రతిసారీ కరోనా వైరస్ మీదా.. ఆ మహమ్మారిని కంట్రోల్ చేయటానికి తన వద్ద పక్కా ప్లాన్ ఉందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే.. సారు మాట్లాడటం షురూ చేసిన తర్వాత ఈటెల వారు మీడియాతో మాట్లాడటం దాదాపుగా బంద్ చేసేశారు.

ఇటీవల కాలంలో అందుకు భిన్నమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా అదే పనిగా మీడియాతో మాట్లాడుతున్న ఈటెల.. కరోనాను కంట్రోల్ చేయటంలో తాము సక్సెస్ అయ్యామని చెబుతున్నారు. పరీక్షలు తక్కువ చేసినా.. అవసరమైన వారికే చేస్తున్నట్లుగా చెప్పుకొస్తారు. ఏపీ అధికారపక్షం వినిపిస్తున్న వాదనకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు ఈటెల. తక్కువ నిర్దారణ పరీక్షలు చేయటం తప్పేం కాదన్నట్లుగా ఆయన వాదన ఉంది.

కరోనా అప్డేట్స్ విషయంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉంటే.. ఈటెల మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ గా మారిపోవటం వెనుక కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ ఎత్తివేత మీద ప్రజలెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. అందుకు భిన్నంగా పొడిగింపు కసరత్తు తో పాటు.. క్లారిటీ రావాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఈ కారణంతోనే కేసీఆర్ మీడియా ముందుకు రావటం లేదంటున్నారు. లాక్ డౌన్ 3.0 పై ప్రధాని మోడీ మాట్లాడిన తర్వాత.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సమీక్ష జరిపిన తర్వాతే.. కేసీఆర్ పెదవి విప్పే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఏమైనా కేసీఆర్ మౌనంగా ఉండిపోయిన వేళ.. ఆ అవకాశాన్ని తనకు తగ్గట్లుగా మలుచుకోవటంలో ఈటెల సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.