Begin typing your search above and press return to search.
లక్షణాలు లేకున్నా పరీక్షలు వద్దన్న ఈటెల మాటల్ని ఫాలో కావాలా?
By: Tupaki Desk | 30 Jun 2020 5:15 AM GMTమహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. ఇప్పుడు ఎక్కడ వైరస్ ఉందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు.. వాళ్లకు వచ్చింది.. వీరికి వచ్చిందన్న వేళ.. మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. కాస్తంత బాగోకున్నా.. మనసులోకి సందేహం వచ్చేస్తుంది. ఫలానా వారికి పాజిటివ్ అన్నంతనే.. పది రోజుల క్రితం కలిశా. దూరంగానే ఉన్నా.. అయినా ఎందుకైనా మంచిదంటూ పరీక్షల కోసం పరుగులు తీసే వారు కొందరైతే.. తరచూ బయటకు వెళ్లి రావాల్సి వస్తోంది.. ఒకసారి పరీక్ష చేసుకుంటే పోలా అనుకుంటూ టెస్టుల కోసం తపిస్తున్న వారు మరికొందరు.
ఇలా ఎవరికి వారు పరీక్షలు చేయించుకోవటం కోసం ఆసక్తి ప్రదర్శించటంతో.. వీరిని చూసి మరికొందరు ఇదే బాట పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రిఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. లక్షణాలు ఉంటే తప్పించి టెస్టులకు రావాల్సిన అవసరం లేదని.. అనవసరంగా ప్రైవేటుల్యాబులకు వెళ్లొద్దని చెబుతున్నారు. మరి.. ఈటెల వారు చెప్పినట్లుగా.. లక్షణాలు లేకుంటే టెస్టులు అక్కర్లేదా? అంటే.. నూటికి నూరు శాతం అక్కర్లేదనే చెప్పాలి.
దీనికి కారణం లేకపోలేదు. లక్షణాలు లేనప్పుడు పరీక్షల కోసం ప్రయత్నిస్తే.. రద్దీ మరింత పెరుగుతుందన్నది ఒక పాయింట్ అయితే.. ఈ క్రమంలో పరీక్షల కోసం వెళ్లే వద్ద.. చుట్టూ ఉండే వారిలో వైరస్ ఉన్నోళ్లు ఉండే ప్రమాదం ఉంది. వారి ద్వారా పొరపాటున అంటుకునే ముప్పు ఉంటుందన్నది మర్చిపోకూడదు. అన్నింటికంటే మించి.. ఒక వ్యక్తి శరీరాంలో వైరస్ ఉన్నా.. అది తీవ్రంగా లేని వేళలో.. పరీక్షల ద్వారా గుర్తించేఅవకాశం తక్కువ.
ఇప్పుడు శాంపిల్స్ సేకరించే విధానాన్ని చూస్తే..అందులో చిన్న తేడా వచ్చినా ఫలితం వేరుగా ఉండే వీలుంది. దీనికి తోడు.. ఏ నిమిషాన తీసిన శాంపిల్ ఆ నిమిషానికి శరీరంలో ఉందో లేదన్న విషయాన్ని చెబుతుందే తప్పించి.. రోజు తర్వాత వైరస్ ఉందో లేదనటానికి సాక్ష్యం కాదన్నది మర్చిపోకూడదు. ఈ కారణంతోనే.. లక్షణాలు లేనప్పుడు.. పరీక్షల కోసం తపించే కన్నా.. మరింత జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.