Begin typing your search above and press return to search.

వైద్యుల త‌ప్పుడు చికిత్స‌...ఇద్ద‌రు చిన్నారుల మృతి...32 మంది

By:  Tupaki Desk   |   8 March 2019 5:04 PM GMT
వైద్యుల త‌ప్పుడు చికిత్స‌...ఇద్ద‌రు చిన్నారుల మృతి...32 మంది
X
వైద్యుల నిర్వాకం చిన్నారుల ప్రాణాల‌ను బ‌లిగొంది. నీలోఫర్‌ లో వ్యాక్సిన్‌ బాధిత చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. పారాసిటమాల్‌ కు బదులు ట్రెమడాల్ మెడిసిన్ ఇవ్వడంతో నిన్న ఓ బాలుడు మృతిచెందగా.. తాజాగా మ‌రోకొరు క‌న్నుమూశారు. 32 మంది చిన్నారులు అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంద‌ని స‌మాచారం.

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌ లో మొత్తం 90 మంది చిన్నారులకు వాక్సిన్ ఇచ్చారు. వాక్సిన్ తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్ లు వేరేవి ఇవ్వటంతో.. 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు నిలోఫర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు చిన్నారులకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిలోఫర్ ఆస్పత్రికి బాధిత కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి ఈటల రాజేందర్‌ పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమవకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు.