Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో తోలి కరోనా కేసు నమోదు..!
By: Tupaki Desk | 2 March 2020 11:35 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 (కరోనా వైరస్) భారత్ కు వ్యాపించింది. దేశవ్యాప్తంగా రెండు కరోనా కేసులను అధికారులు గుర్తించారు. ఇటలీ నుండి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి - అలాగే దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదవడంతో తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనితో తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ పై హై అలెర్ట్ ప్రకటించింది.
అలాగే కరోనా వైరస్ పై ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, కరోనావైరస్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, అతను దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చే క్రమంలో ఎవరెవరిని కలిశారు అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది కరోనా వైరస్. ఇప్పటి వరకు మూడు వేలమంది చనిపోగా.. సుమారు 80వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. చైనాలో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం కొత్త కేసులు నమోదవుతుండడం తో కరోనా అంటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.