Begin typing your search above and press return to search.
తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !
By: Tupaki Desk | 25 April 2020 5:30 AM GMTకరోనా వైరస్ కు చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు, వైరాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని మార్గాలను అన్వేషించారు. అందులో ఒకటి ప్లాస్మా థెరపీ. కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి.. కరోనా తో పోరాడుతున్న వారికీ ట్రీట్మెంట్ చేయడం దీని ప్రత్యేకత. ఇప్పటికే ఈ విధానంతో దేశంలో కొన్ని రాష్ట్రాలలో కేంద్రం అనుమతితో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్లాస్మా థెరపీ విజయవంతం అవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అటు వైపుగా దృష్టి పెట్టింది.
ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు ప్లాస్మా ధెరపి ద్వారా చికిత్స చేయడానికి కేంద్రం నుండి అనుమతి వచ్చింది అని, పరిస్థితి విషమించిన రోగులకు ప్లాస్మా ధెరపి చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇకపోతే, తెలంగాణలో మూడు రోజుల నుంచి రోజుకు ఇరవైలోపే బయటపడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలలో పదమూడు పాజిటివ్ కేసులు మాత్రమే లెక్క తేలినట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 291. మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983 కాగా.. మృతులు, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యను తీసేస్తే, యాక్టివ్ గా ఉన్న కేసులు 663 మాత్రమే. వీరిలో ఏడుగురు పరిస్థితి సీరియస్ గా ఉంది అని , వారందరూ వెంటిలేటర్లపై ఉన్నారు. మిగిలిన వారందరూ చురుగ్గానే ఉన్నారని అయన తెలిపారు.
ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత మంది వల్లనే వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన కేసుల్లో 44 కుటుంబాల ద్వారా 265 మందికి..సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి సోకింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని.. రాను రాను.. కేసుల సంఖ్య తగ్గిపోతుందని.. తెలంగాణ సర్కార్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అలాగే , కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది. తమ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తూండటంతో పట్టు విడవకూడదని నిర్ణయించుకుంది. అలాగే , క్వారంటైన్ సమయాన్ని ఇరవై ఎనిమిది రోజులకు పెంచింది.