Begin typing your search above and press return to search.

నమ్మకద్రోహం.. మళ్లీ తిరగబడ్డ మంత్రి ఈటల

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:22 AM GMT
నమ్మకద్రోహం.. మళ్లీ తిరగబడ్డ మంత్రి ఈటల
X
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇది వరకే కేసీఆర్ తనను మంత్రివర్గంలోంచి తొలగిస్తున్నారనే వార్తలతో కలత చెంది.. ‘గులాబీ పార్టీకి తామే ఓనర్లం’ అంటూ కలకలం రేపారు.

ఆ వ్యాఖ్యలు మరిచిపోకముందే మరోసారి తన నియోజకవర్గం హుజూరాబాద్ లో కార్యకర్తలతో సమావేశం లో మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నమ్మక ద్రోహం చేస్తే తనకు బాధ కలుగుతోందని’ వాపోయారు. నమ్మకద్రోహం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరని.. కోట్లు ఖర్చైనా తాను ఎవరి వద్దా కూడా చేయి చాపలేదన్నారు. ప్రజలు ధర్మం తప్పరని.. అందుకే తనను గెలిపించారని.. ప్రజలు ధర్మం తప్పితే తాను గెలిచేవాడిని కాదని హాట్ కామెంట్స్ చేశారు.

తనను ఓడించడానికి ప్రయత్నించిన వారికి, మంత్రి వర్గం నుంచి తీసేయడానికి చూస్తున్న వారికి కౌంటర్ గా ఈటెల రాజేందర్ మరోసారి ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.