Begin typing your search above and press return to search.
మహమ్మారి వీడియోలపై ఈటల ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 29 Jun 2020 12:30 PM GMTజూన్ 24న ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి లో 35 ఏళ్ల వ్యక్తి మహమ్మారి వ్యాధి తో ఊపిరి ఆడక.. వెంటిలేటర్ అందించక పోవడం తో మరణించడం కలకలం రేపింది. అతడు మరణించడానికి ముందు వీడియో తీసి తన తండ్రి కి పంపాడు. ఆ వీడియో సోషల్ మీడియా లో పెట్టడం తో ఆ వీడియో వైరల్ అయ్యింది. తెలంగాణ ఆస్పత్రుల లో పేలవమైన పనితీరును ప్రతిబింబించే ఈ వీడియో పై తాజా గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నోరు పారేసుకున్నారు.
తాము మహమ్మారి రోగులు వారి కుటుంబాలకు దూరంగా ఉన్నందుకు ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించడానికి అనుమతిచ్చామని.. బంధువులు, కుటుంబంతో మాట్లాడి సేదతీరాలని ఇలా చేశామని.. కానీ మహమ్మారి రోగులు చిన్నదానికి పెద్ద దానికి వీడియోలు తీసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ వైద్యసేవలపై తప్పుడు ప్రచారం దీని వల్ల అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరచకుండా ఇలా ఫోన్లలో వీడియోలు తీస్తే తప్పు పడుతారా అని పలువురు మండిపడుతున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు బాగుంటే వాళ్లు ఇలా వీడియాల్లో నిలదీస్తారా అని ప్రశ్నించారు. మొత్తం బాధితుడి వీడియోపై బాధ్యతారాహిత్యమైన వ్యాక్యలు చేసిన ఈటలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.