Begin typing your search above and press return to search.

ఈట‌ల ఒంట‌రి త‌నం.. వెనుక‌..? ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   16 Sep 2021 11:30 PM GMT
ఈట‌ల ఒంట‌రి త‌నం.. వెనుక‌..?  ఏం జ‌రుగుతోంది?
X
మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ అంత‌రంగం ఏంటి? ఆయ‌న ఒంట‌రిగానే రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటున్నారా? లేక‌.. బీజేపీ నేత‌లే ఆయ‌న‌ను ఒంట‌రిని చేస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈట‌ల‌.. అంద‌రినీ క‌లుపుకొని పోయేవారు. అంద‌రితోనూ క‌లివిడిగా ఉండేవారు. అయితే, ఇది పాత ముచ్చ‌ట‌. టీఆర్ ఎస్‌లో ఉన్న‌ప్ప‌టి మాట‌. కానీ, ఇప్పుడు ఆయ‌న టీఆర్ ఎస్‌తో విబేదించారు. సీఎం కేసీఆర్‌కు దూరంగా ఉంటున్నారు. బీజేపీలో చేరి.. కాషాయ కండువా క‌ప్పుకొన్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. బీజేపీ నేత‌లు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలకు ఈట‌ల దూరంగా ఉన్నారు. ఇక‌, ఈట‌ల నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు బీజేపీ నేత‌లు కూడా దూరంగా ఉంటున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఈట‌ల‌తో బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డం లేదా? లేక‌.. బీజేపీ నేత‌ల‌తో ఈట‌లే దూరంగా ఉంటున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి ఈట‌ల టీఆర్ ఎస్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. సొంత హ‌వాతోనే ముందుకు సాగారు. త‌న పేరు, త‌న మాట‌ల ధాటి.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా.. తెలంగాణ వాదాన్ని బ‌లంగా వినిపించిన నేత‌గా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు.

అంటే.. ఒంట‌రిగానే ఆయ‌న రాజ‌కీయ మార్కులు సాధించారు. ఇదే హ‌వాను కొన‌సాగించాల‌నేది ఈట‌ల వ్యూహంగా క‌నిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆయ‌న ఇక్క‌డ నుంచి గెలిచితీరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పాద‌యాత్ర పెట్టుకున్నారు. అయితే.. ఈ యాత్ర‌కు బీజేపీ నుంచి పెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రాలేదు. అంటే.. ఈట‌ల‌కు డిస్టెన్స్ పాటించారు. ఇది ఈట‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేదు. ఇక‌, బీజేపీ రాష్ట్ర సార‌థి.. బండి సంజ‌య్‌.. సంగ్రామ యాత్ర చేప‌ట్టారు. దీనిపై ఈటెల ఇప్ప‌టి వ‌ర‌కు కామెంట్ చేయ‌లేదు.

సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈట‌ల ఒంట‌రిగానే హుజూరాబాద్‌లో పాగా వేయాల‌ని నిర్ణ‌యించుకు న్నట్టు తెలుస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిలో మ‌రో రీజ‌న్ కూడా ఉంద‌ని అంటున్నారు. అదేంటంటే.. టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఆరు సార్లు గెలిచిన ఈట‌ల‌.. ఎప్పుడూ.. పార్టీ ప్ర‌భావంతో గెలిచాన‌ని చెప్పుకోలేదు. త‌న సొంత ఇమేజ్‌తోనే గెలిచాన‌ని అనుచ‌రుల వ‌ద్ద వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు క‌నుక‌.. బీజేపీని ముందు పెట్టి.. తాను ప్ర‌చారానికి దిగితే.. ఈట‌ల సొంత ఇమేజ్‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంటుంది. పైగా.. బీజేపీకి హుజూరాబాద్‌లో ఏమీ లేదు. అలాంటి పార్టీని ముందు పెట్టినందున ఈట‌ల‌కు ఒరిగేది అంత‌క‌న్నా ఏమీ ఉండ‌దు. సో.. ఎటొచ్చీ.. సోలో రాజ‌కీయ‌మే బెట‌ర‌ని ఈట‌ల భావించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుందోంది.