Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో 'ఈటల' పని ఖతమేనా?

By:  Tupaki Desk   |   17 Dec 2018 10:39 AM GMT
ఈ దెబ్బతో ఈటల పని ఖతమేనా?
X
చరిత్ర ఏం చెబుతోంది. తెలుగునాట శాసన సభ స్పీకర్ గా చేస్తే రాజకీయంగా సమాధి అవుతారని గుర్తు చేస్తోంది. ఒకప్పుడు అధికారంలోకి వచ్చి శాసనసభ స్పీకర్ గా చేసిన కేఆర్ సురేష్ రెడ్డి - ఇప్పుడు మధుసూదనాచారిలు.. అంతకుముందు చేసిన వాళ్లు కూడా తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా మనుగడ సాధించని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా స్పీకర్ పదవి ఇస్తామంటే ఎవ్వరూ తీసుకోని పరిస్థితి ఉంది. మకొద్దంటే మాకొద్దంటూ తప్పించుకు తిరుగుతున్నారట..

స్పీకర్ పదవి చేపడితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే అప్రప్రద నేతలను తరాలుగా వెంటాడుతోంది. అందుకే తాజాగా స్పీకర్ పదవి తీసుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ను అధిష్టానం చెప్పినా ఆయన వద్దు బాబాయ్ అంటున్నాడట.. తనకు కేసీఆర్ గడిచిన సారి మంత్రి పదవి హామీ ఇచ్చాడని అదే ఇవ్వాలని కోరుతున్నాడట.. ఇక గడిచిన సారి డిప్యూటీ స్పీకర్ గా చేసిన పద్మా దేవందర్ రెడ్డి కూడా తనకు స్పీకర్ పోస్టు వద్దు మహిళా కోటాలో మంత్రి పదవి కావాలంటూ కోరుతున్నారట..

దీంతో కేసీఆర్ ఇక తనకు వీర విధేయుడు - గడిచిన సారి ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ సభ్యుడిగా ఈటెలకు సభా నియమాలు తెలుసునని.. కేసీఆర్ చెబితే ఈటల కాదనరనే నమ్మకం అధిష్టానంలో ఉందట.. అందుకే ఎలాగైనా సరే ఈటెలను స్పీకర్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడట.. మరి స్పీకర్ సెంటిమెంట్ తెలిసి ఈటల ఒప్పుకుంటాడా? ఈ డేంజర్ పదవిని చేపడుతారా.. కీలకమైన పోర్టు పోలియోలను త్యాగం చేసి ఇప్పుడు స్పీకర్ పదవి చేపడుతారా అన్నది వేచిచూడాల్సిందే..