Begin typing your search above and press return to search.
గంగుల గాలి తీసిన ఈటల.. నోరు జారితే ఎవరికైనా ఇదే గతి!
By: Tupaki Desk | 5 May 2021 9:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు అంటూ ఎవరు ఉండరన్న విషయం తెలిసిందే. ఎవరైనా సరే.. ఆయా కాలాల్లో మాత్రమే ఆయనకు సన్నిహితంగా ఉంటారు. ఆ మాటకు వస్తే.. ఒక్కొక్కరికి ఒక్కో టైం నడుస్తుంటుంది. కేసీఆర్ సైతం.. కొందరు నేతలకు కొంత కాలం ఇస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయన పొలిటికల్ జర్నీని చూస్తే.. ఏ ఒక్క నేతకు ఒకేలాంటి గౌరవ మర్యాదల్ని సుదీర్ఘ కాలం ఇచ్చిన దాఖలాలు కనిపించవు. నాలుగైదు రోజులుగా ఈటలను టార్గెట్ చేయటం.. ఆయన మంత్రిత్వ శాఖను పక్కన పెట్టి.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన వైనం తెలిసిందే.
ఆయనపై భూకబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటివేళ.. కాస్తంత బరస్ట్ అయిన ఈటల మీద.. కొందరు మంత్రులు అనూహ్యంగా నోరు పారేసుకున్నారు. అలాంటి వారిలో కొందరు ఈటలకు సన్నిహితమైన వారే కావటం విశేషం. కేసీఆర్ ప్లానింగ్ అలానే ఉంటుంది మరి. అలా ఈటల తీరును తీవ్రంగా తప్పు పట్టిన వారిలో మంత్రి గంగుల కమలాకర్ ఒకరు.
ఈటలకు సన్నిహితుడిగా పేరున్న ఆయన.. చీమల పుట్టలో పాము లెక్కన అంటూ రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారటమే కాదు.. రాజకీయాలు ఎంత కర్కశంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి. తనను దారుణంగా డ్యామేజ్ చేస్తున్నా.. పంటి బిగువునా ఓర్చుకుంటూ ఆచితూచి మాట్లాడుతున్నారు ఈటల. తనను భూకబ్జాదారుగా ముద్ర వేసి.. నివేదికలతో తేలుస్తున్నా.. ఒకట్రెండు వ్యాఖ్యలు తప్పించి తొందరపడటం లేదు.
ఇలాంటివేళ.. తన తీరుకు భిన్నంగా తన మీదకు తన సహచరుల్ని ఉసిగొల్పుతున్న వైనంపై మొదటిసారి ఈటల బరస్ట్ అయ్యారు. తనను చీమల పుట్టలో పాము లెక్కన దూరాడని.. మేక వన్నె పులి అంటూ ఘాటు విమర్శ చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు ఊహించని షాకిచ్చారు ఈటల. ఎవరి చరిత్ర ఏమిటో తాను చెప్పనని.. అధికారం నీడలో ఉన్నంత మాత్రాన.. ఎవరేం మాట్లాడారో తన దగ్గర ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఒక ఉదాహరణను ప్రస్తావించారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా సమస్యల గురించి ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లామని.. గేట్ల దగ్గర తమను సెక్యురిటీ సిబ్బంది ఆపారన్నారు. ‘అక్కడే ప్రెస్సోళ్లు ఉన్నారు. మా ఇజ్జత్ కోసం.. కనీసం కారు లోపలకు వెళ్లి తిరిగి వస్తామని రిక్వెస్టు చేశాం. సీఎం ఆరోగ్యం బాగాలేదనో.. మూడ్ బాగోలేదనో పోనీయకపోతే ఇదే గంగుల కమలాకర్ నాతో.. ‘ఇంత అహంకారముంటదా అన్న’ అని అన్నారు. మన ఇగో దెబ్బ తింటే కరీంనగర్ నుంచే మరో విప్లవదం వస్తుందని వ్యాఖ్యానించారని.. అలాంటి వ్యక్తి ఈ రోజున తనపై విమర్శలు చేయటమా? అని ఈటల ప్రశ్నించారు.
ఈ ఒక్క ఉదాహరణతో గంగుల గాలి మొత్తంగా పోవటమే కాదు.. సీఎం కేసీఆర్ రెడ్ మార్కు పెట్టటానికి సరిపోతుందంటున్నారు. తన ఉదాహరణతో గంగుల ఫ్యూచర్ ను ప్రశ్నార్థకంగా మార్చటంలో ఈటల సక్సెస్ అయ్యారంటున్నారు. అంతేకాదు.. తనపై అనవసరంగా మాట తూలిన వారు ఎవరైనా సరే.. ఇలాంటి షాకులు తప్పవన్న వార్నింగ్ ఇచ్చేసినట్లు కనిపించక మానదు.